E-Paper
Advertisement

వేసవిలో మీ బెడ్ వేడిగా ఉంటుందా? ఈ బెడ్‌షీట్ ఉపయోగిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం

వేసవిలో మీ బెడ్ వేడిగా ఉంటుందా? ఈ బెడ్‌షీట్ ఉపయోగిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం
Advertisement

Bedsheets For Comfortable sleep| వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రి సమయంలో కూడా వేడిగా ఉంటుంది. ఫ్యాన్లు, కూలర్లు నడుస్తున్నప్పటికీ పడుకునే బెడ్ వేడిగానే అనిపిస్తుంది. దీనికి అసలు కారణం తరచుగా మీ బెడ్‌ షీట్ లోనే ఉంటుంది. భారీ లేదా సింథటిక్ షీట్లు వేడి, మీ శరీర చెమటను బెడ్ లోపలే బంధిస్తాయి. దీంతో మీకు నిద్ర సరిగా పట్టదు, అసౌకర్యంగా ఉంటుంది. సరైన బెడ్‌షీట్ ఎంచుకోవడం ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.

సౌకర్యం కోసం కాటన్ బెడ్‌షీట్

వేసవి బెడ్షీట్లకు కాటన్ బెస్ట్. ఇది మృదువుగా, తేలికగా ఉంటుంది. గాలిని లోపలికి పోనిస్తుంది. కాటన్ చెమటను గ్రహించి, మీ శరీరాన్ని పొడిగా ఉంచుతుంది. మీకు అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ప్యూర్ కాటన్ బెడ్‌షీట్‌లు మిక్స్ ఫ్యాబ్రిక్ల కంటే బాగా పనిచేస్తాయి. వేడి రాత్రుల్లో సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి.

లినెన్ బెడ్‌షీట్ ఒక ప్రీమియం కూలింగ్ ఆప్షన్

Advertisement

లినెన్ ఫ్యాబ్రిక్ వేసవికి మరొక గొప్ప ఆప్షన్. ఈ ఫ్యాబ్రిక్ శరీర వేడిని త్వరగా తగ్గించి, చెమటను పీల్చి త్వరగా ఆరిపోతుం కూడా. ఈ బట్ట కొద్దిగా గరుకుగా అనిపించవచ్చు, కానీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది విపరీతమైన వేడి వాతావరణంలో కూడా మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. లినెన్ షీట్లు ఖరీదైనవి కావచ్చు, కానీ ఇందుల గాలి బాగా ప్రవహిస్తుంది.

సింథటిక్ బట్టలను ఎందుకు పూర్తిగా నివారించాలి?

పాలిస్టర్ వంటి సింథటిక్ పదార్థాలు వేసవి కాలానికి తగినవి కావు. అవి వేడిని లోపలే బంధించి, మీ శరీరం చుట్టూ గాలి ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఈ బట్టలు చెమటతో పాటు జిడ్డును కూడా పెంచుతాయి. దీని వల్ల పదే పదే మీకు నిద్ర భంగం కలుగుతుంది. ఎల్లప్పుడూ సింథటిక్ బట్టలకు బదులు కాటన్ లాంటి సహజ బట్టలను ఎంచుకోండి.

Advertisement

Also Read: 20 ఏళ్ల వయసు తరువాత కూడా మీ ఎత్తు పెంచుకోవచ్చు? సులభంగా ఇలా చేయండి

చల్లదనం కోసం లేత రంగులు, తేలికపాటి షీట్లను ఎందుకు ఎంచుకోవాలి?

వేసవి కాలంలో శరీర సౌకర్యం కోసం లేత రంగులు బాగా ఉపయోగపడతాయి. లేత రంగులు వేడిని ప్రతిబింబించి, మీ బెడ్‌ని చల్లగా ఉంచుతాయి. తెలుపు, లైట్ బ్లూ, పేల్ షేడ్స్ బాగా పనిచేస్తాయి. అవి ప్రశాంతమైన మరియు తాజా వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి. డార్క్ కలర్స్ వేడిని గ్రహించడం వల్ల బెడ్‌లు వెచ్చగా చేస్తాయి. అలాగే, భారీ బెడ్‌షీట్లు గాలి ప్రవాహాన్ని నిరోధించి, లోపల వేడిని బంధిస్తాయి. తేలికపాటి షీట్లు మంచి గాలి ప్రసరణను అనుమతిస్తాయి.

వేసవిలో సరిగా పట్టకపోవడానికి ప్రధానంగా మీరు ఉపయోగించే తప్పుడు బెడ్‌షీట్ల వల్లే జరుగుతుంది. గాలి ప్రవాహం బాగా జరిగి, చల్లదనం కోసం కాటన్ లేదా లినెన్ ఎంచుకోండి. సింథటిక్ బట్టలు, డార్క్ కలర్స్ పూర్తిగా నివారించండి.

Related News

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

Big Stories

Advertisement
×