E-Paper
Advertisement

Curry Leaves Benefits: జీర్ణ సమస్యలకు చెక్ పెట్టి.. లివర్‌ని క్లీన్ చేసే కరివేపాకు.. పళ్లెం నుంచి తీసిపారేస్తే నష్టపోయేది మీరే!

Curry Leaves Benefits: జీర్ణ సమస్యలకు చెక్ పెట్టి.. లివర్‌ని క్లీన్ చేసే కరివేపాకు.. పళ్లెం నుంచి తీసిపారేస్తే నష్టపోయేది మీరే!
Advertisement

Curry Leaves Benefits: సాధారణంగా మన ఇంట్లో కూరల్లో కరివేపాకు కనిపిస్తే ఏం చేస్తాం? వెంటనే వేళ్లతో దాన్ని తీసి పక్కన పడేస్తాం. కేవలం వంటకు సువాసన ఇవ్వడానికే దీన్ని వాడతారని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ, ఈ చిన్న ఆకుల్లో దాగున్న ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం ఆ తప్పు మళ్లీ చేయరు. కరివేపాకు కేవలం పోపు దినుసు మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన ఆయుర్వేద గని. మన పూర్వీకులు ప్రతి వంటలో దీన్ని చేర్చడం వెనుక పెద్ద ఆరోగ్య రహస్యమే ఉంది.

అజీర్తి సమస్యలకు చెక్..

చాలామందిని ఆహారం సరిగ్గా అరగక పోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఆ సమయంలో కరివేపాకు రెబ్బలను నలిమి మింగితే, శరీరంలో జీర్ణ ఎంజైమ్‌లు విడుదలవుతాయి. దీంతో పేగుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. తిన్న ఆహారం త్వరగా శక్తిగా మారుస్తాయి. అలాగే కరివేపాకును నూనెలో వేయించినప్పుడు వచ్చే ‘గిరినింబైన్’ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది.

Advertisement

Also Read: మార్నింగ్ బ్రష్ చేయడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఈ ‘రెండు నిమిషాల’ మ్యాజిక్ గురించి తెలుసా?

సులభంగా బరువు తగ్గొచ్చు..

నేటి కాలంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే జిమ్ములు, డైటింగ్‌లతో పాటు రోజువారీ ఆహారంలో కరివేపాకును చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకులో ఉండే ‘మహానింబైన్’ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీర మెటబాలిజం రేటును పెంచడమే కాకుండా.. ఆకలిని నియంత్రించి క్యాలరీలు త్వరగా ఖర్చయ్యేలా చేస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే కొన్ని కరివేపాకు రెబ్బలు నమలడం మంచిది.

షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో..

Advertisement

డయాబెటిస్ బాధితులకు కరివేపాకు సంజీవని లాంటిది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరచూ కరివేపాకును తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పూడికలు రాకుండా నివారించవచ్చు.

నిగనిగలాడే నల్లని జుట్టు కోసం..

జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడేవారికి కరివేపాకు కంటే మించిన మందు లేదు. కరివేపాకులో ఉండే విటమిన్లు, అమినో యాసిడ్లు తల చర్మం వద్ద రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారై, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది కేవలం జుట్టు పెరగడానికే కాదు.. జుట్టులోని సహజమైన నలుపు రంగును కాపాడటానికి కూడా దోహదపడుతుంది.

ఇతర ప్రయోజనాలు..

కరివేపాకు కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. మన శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడం నుండి కంటి చూపును కాపాడటం వరకు దీని లాభాలు అనేకం. కాబట్టి.. ఇక నుంచి అన్నం తింటున్నాప్పుడు కరివేపాకు కనిపిస్తే పక్కన పడేయకుండా.. ఇష్టంగా నమిలి మింగేయండి. ఇలా చేయడం ద్వారా బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బొప్పాయితో కలిగే అద్భుత ప్రయోజనాలివే!

 

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×