E-Paper
Advertisement

Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే
Advertisement

Virat Kohli to Rohit Sharma:  టీమిండియా టాప్ మోస్ట్ క్రికెటర్లు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీళ్లతోపాటు టీమిండియా కెప్టెన్ గిల్, బూమ్ బూమ్ బుమ్రా అని కూడా చెబుతూ ఉంటారు. ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రానించి, టీమిండియా కు ఎన్నో విజయాలు ఒంటి చేత్తో అందించారు ఈ క్రికెటర్లు. అయితే ఇదే క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ కోట్లల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. అదే సమయంలో ఒక్క పోస్టుకు కోట్లల్లో డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అయితే ప్రమోషన్ పోస్టు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి కోట్లు దండుకుంటున్నాడు.

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ల సంపాదన

Advertisement

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ నుంచి వరకు గిల్ వరకు అందరు క్రికెటర్లు కోట్లల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇందులో విరాట్ కోహ్లీకి 270 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఒక పోస్టుకు 11 కోట్ల నుంచి 14 కోట్ల వరకు విరాట్ కోహ్లీ ఛార్జ్ చేస్తున్నాడు. టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఎక్కువ స్థాయిలో ఫాలోవర్స్ ను కలిగి ఉండడమే కాకుండా డబ్బులు కూడా ఎక్కువగా చార్జ్ చేస్తున్నాడు.

అలాగే మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. క్రమ క్రమంగా పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీకి 50 మిలియన్ల ఫాలోవర్స్ ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు. ఆయన ఒక్క స్పాన్సర్ పోస్టుకు కోటిన్నర రూపాయలు తీసుకుంటారు. ఎక్కువ శాతం సోషల్ మీడియాలో ధోని యాక్టివ్ గా ఉండడు. అయినప్పటికీ కోట్లల్లో సంపాదిస్తున్నారు.

Advertisement

ఇటు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ గిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది తక్కువ కాలంలోనే కెప్టెన్ స్థాయికి ఎదిగిన గిల్ కు ఇన్స్టాగ్రామ్ లో 18.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఒక్క ప్రమోషన్ పోస్టుకు కోటి రూపాయలు తీసుకుంటున్నారు. యంగ్ క్రికెటర్ ఈ స్థాయిలో తీసుకోవడం ఇదే మొదటిసారి అంటున్నారు.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు 45.6 మిలియన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. అయినప్పటికీ గిల్, మహేంద్ర సింగ్ ధోని కంటే తక్కువగానే ఒక పోస్టుకు తీసుకుంటున్నాడు. ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్టుకు 75 నుంచి 76 లక్షలు చార్జ్ చేస్తున్నాడట రోహిత్ శర్మ. హార్దిక్ పాండ్యా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు 45 మిలియన్స్ ఉన్నారు. ఒక్క పోస్టుకు హార్దిక్ పాండ్యా 65 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఇంస్టాగ్రామ్ లో 21 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. ఆయన కోటి రూపాయల వరకు చార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×