
Divi vadthya (Image credit: Instagram)
ప్రముఖ నటి దివి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్బాస్ లో సందడి చేసిన ఈమె సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.

Divi vadthya (Image credit: Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. మరొకవైపు సాంప్రదాయంగా కూడా దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.

Divi vadthya (Image credit: Instagram)
ఇదిలా ఉండగా తాజాగా ఈమె గురువారం వేకువ జామున తన సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Divi vadthya (Image credit: Instagram)
దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Divi vadthya (Image credit: Instagram)
అనంతరం ఆలయం వెలుపల ఆమెతో పలువురు అభిమానులు, భక్తులు కలిసి ఫోటోలు దిగారు. ఇక ఆమె కూడా సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. ఇక తాజాగా దివి అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Divi vadthya (Image credit: Instagram)
ఆధ్యాత్మిక బాటలో సాంప్రదాయంగా కనిపిస్తున్న దివి మరింత అందంగా మెరిసిపోతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.