E-Paper
Advertisement

ఎండల తీవ్రతకు ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!

ఎండల తీవ్రతకు ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Advertisement

Summer Health Tips: ప్రస్తుతం మండిపోతున్న ఎండలు తీవ్రతకు చల్లటి ఐస్ క్రీమ్ తినడం అందరికీ ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల దాకా మధ్యాహ్నం కాగానే చల్లదనం కోసం దీనిని ఆశ్రయిస్తారు. అయితే, ఈ అలవాటు అందరికీ మంచిది కాదని, ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఐస్ క్రీమ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

షుగర్, గుండె జబ్బుల ముప్పు:

బయట షాపుల్లో దొరికే ఐస్ క్రీముల్లో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అలాగే, ఇందులో ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిది.

లివర్ సమస్యలు ఉన్నవారికి ఇబ్బందే:

Advertisement

ఫ్యాటీ లివర్ (కాలేయ సమస్యలు) ఉన్న రోగులు ఐస్ క్రీమ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో ఉండే చక్కెర, కొవ్వులు కాలేయంపై అదనపు భారాన్ని పెంచుతాయి. ఇది కాలేయ వ్యాధిని మరింత తీవ్రం చేస్తుంది.

Also Read: 60 రోజుల పాటు చక్కెర మానేస్తే.. మన శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం:

Advertisement

చాలామంది ఐస్ క్రీమ్ ఇచ్చే తాత్కాలిక చల్లదనాన్నే చూస్తారు కానీ, అది జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావాన్ని గమనించరు. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పైగా ఎండకాలంలో మరీ చల్లని పదార్థాలు తింటే అసిడిటీ, అజీర్తి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎన్నో:

ఐస్ క్రీమ్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన గడ్డ పెరుగు, ఫ్రూట్ స్మూతీలు, తాజా పండ్లను తీసుకోవడం ఎంతో మేలు. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మజ్జిగ, కొబ్బరినీళ్లు, తాజా పండ్ల రసాలు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: సమ్మర్‌లో ఫ్రిడ్జ్ కరెంట్ బిల్లు హాఫ్ అవ్వాలంటే.. ఈ సింపుల్ చేంజెస్ చేసుకుంటే చాలు!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×