E-Paper
Advertisement

Block Jeera:- రోజూ ఇది తింటే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

Block Jeera:- రోజూ ఇది తింటే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
Advertisement

Block Jeera:- ప్రస్తుత కాలంలో జంక్‌ ఫుడ్‌, ఇతర కారణాల వల్ల మన శరీరంలో బాగా కొవ్వు పేరుకుపోతోంది, దీని వల్ల అనేక జబ్బుల బారిన పడుతున్నాం. కొవ్వు తగ్గించుకునేందుకు ఎన్నో వ్యాయామాలు, రకరాల మందులు వాడుతుంటారు. మన శరీరంలో మెటబాలిజం రేటు తక్కువగా ఉండటంతో అధిక కొవ్వు పేరుకుపోతోంది. ఈ చిన్న పనిచేస్తే మీ శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోవడం ఖాయం. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి కేవలం రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది. నల్ల జీలకర్ర..ఇది మన శరీర బరువును తగ్గించడంతవో పాటు మెటబాలిజం రేటును కూడా బాగా పెంచుతుంది. అలాగే కొవ్వును తొల‌గించ‌డంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. న‌ల్ల జీల‌క‌ర్ర రుచి చాలా చేదుగా ఉంటుంది. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్‌లో ఇది మనకు లభిస్తుంది. న‌ల్ల జీల‌క‌ర్ర వాడ‌డంతో మన కడుపు చుట్టూ పేరుకున్న కొవ్వు తొందరగా క‌రుగుతుంది. అంతేకాకుండా కడుపులోపలి సమస్యలు కూడా తగ్గిపోతాయి.బాడీలో కొవ్వుల స్థాయిలు సైతం అదుపులోకి వస్తాయి. కేన్సర్‌లాంటి ప్రాణాంత‌క రోగాల బారిన ప‌డ‌కుండా మనల్ని నల్లజీలకర్ర రక్షిస్తుంది. మన బ్లడ్‌లో షుగర్‌ లెవెల్స్‌ కూడా అదుపులోకి వస్తాయి. నల్ల జీలకర్రతో పాటు అవిసె గింజలు కూడా కొవ్వును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిలో అధిక శాతం పోష‌కాలు, ఫైబర్‌ ఉంటాయి. అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డంతో క‌డుపు నిండినట్లు ఉంటుంది, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. చిట్కా తయారు చేసుకోవడానికి గిన్నెలో 3 చెంచాల నల్లజీలకర్ర తీసుకోవాలి. దాంట్లో 2 చెంచాల అవిసె గింజలను వేసుకోవాలి. చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఈ పౌడర్‌ను ఉపయోగించవచ్చు. గ్లాసు గోరువెచ్చని నీళ్లలో అరటీస్పూన్‌ పౌడర్‌ను కలుపుకుని ఉదయం పరగడుపున టీ తాగినట్లు తాగుతూ ఉండాలి. దీన్ని తీసుకున్న 30 నిమిషాల వరకు ఏం ఆహారం తీసుకోకూడదు. మళ్లీ రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత పొడిని నీళ్లలో కలుపుకొని తాగాలి. నిత్యం దీన్ని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×