Big Stories

Drinking Water Problem: 75 ఏళ్ల స్వతంత్ర భారతం.. గుక్కెడు నీళ్ల కోసం ఇంకా తప్పని పాట్లు

Drinking Water Problem: స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తోంది. భారత్‌ చంద్రయాన్‌ వంటి మైలురాయిని అందుకుని.. సూర్యుడిపై ప్రయోగాలు కూడా చేస్తుంది. ఇంతజరుగుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం సమస్యలు అలాగే ఉన్నాయి. కనీస అవసరాలు కూడా అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటిలో మంచినీటి సమస్య ఒకటి.

- Advertisement -

ఏపీలోని సత్యసాయి జిల్లా మడకశిరలో ఎండాకాలం రాకుండానే నీటి సమస్య తలెత్తింది. గుక్కెడు నీటి కోసం ఐదేసి కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి. అన్ని సంక్షేమ పథకాలనూ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు.. ఇలాంటి విషయాలను మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నాయి. కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలు తమకెందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు మహిళలు.

- Advertisement -

చాలా కాలంగా అధికారులు, నేతలు చుట్టూ తిరిగి.. సమస్య పరిష్కారం కాకపోవటంతో ఆందోళన చేపట్టారు. పోరాటం ద్వారానే సాధించుకోవాలని నిర్ణయించుకుని.. ఎంపీడీవో కార్యాలయం వద్ద పత్తికుంట గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మేడలు, మిద్దెలు తమకు అవసరం లేదని.. గుక్కెడు నీరు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

గ్రామస్థుల పోరాటానికి కేవీపీఎస్ మద్దతు తెలిపింది. అనంతరం ఎంపీడీఓకు బాధితులు వినతిపత్రం అందించారు. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకూ తమ గోడు విన్నవించుకున్నారు. తమ ప్రాంతంలో చాలాకాలంగా సమస్య ఉన్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదని మహిళలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఉన్న బోరు బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని.. చాలా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు.

కొన్నిచోట్ల రైతులు.. తమ బోరుబావులకు రావద్దని చెబుతున్నారని.. వాళ్లను బ్రతిమాలుకుని కొన్ని బిందెలు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News