
Saffron : కుంకుమ పువ్వు అంటేనే గర్భిణులు తినాలని చాలామంది చెబుతుంటారు. కానీ దాన్ని ఎవరైనా తినొచ్చని నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పులు తగ్గించడం, నిద్ర లేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలకు ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే కుంకుమపువ్వులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చర్మానికి మెరుపు తీసుకురావడంలో దీని పాత్ర ఎంతో ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఎలాంటి క్రీమ్‌లు వాడుకుండానే సహజసిద్ధంగా చర్మం మెరిసేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు తగ్గించడంలోనూ కుంకుమపువ్వు ఎంతో దోహదపడుతుంది.
అంతేకాకుండా డిప్రెషన్‌ను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పైటోకెమికల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ మెదడుకు అవసరమైన సెరోటోనిన్‌ను అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా రుతుక్రమ సంబంధిత సమస్యలను కూడా కుంకుమపువ్వు దూరం చేస్తుంది. కుంకుమ పువ్వు వాడటం వల్ల అధిక రక్తస్రావంలాంటి సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు. అలాగే అంగస్తంభన సమస్యలు, వీర్య కణాలు తక్కువ ఉన్నవాళ్లు రోజూ కుంకుమ పువ్వును వాడటం వల్ల మంచి ఉపసమనం ఉంటుంది.
బాదం పాలల్లో కుంకుమ పువ్వును కలిపి వాడితే సెక్స్ సామర్థ్యంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం బాగా పెరుగుతుంది. క్యాన్సర్ కారణమైనవాటిపై ప్రీ రాడికల్స్ ఎక్కువ కాకుండా ఉండేలా చూసే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా ఉంటాయి. ప్రతిరోజు కుంకుమ పువ్వు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కుంకుమపువ్వు జీవక్రియను నియంత్రిస్తుంది, కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే నిద్రబాగా పడుతుంది. దీనిలో ఉండే మాంగనీస్ శరీరానికి ప్రశాంతత కలిగించి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. కుంకుమపువ్వులోని క్రోసిన్ జ్వరాన్ని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగితే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. ఆస్తమా, కోరింత దగ్గును నివారిస్తుంది.