E-Paper
Advertisement

Cabbage Pakoda: కర కరలాడే క్యాబేజీ పకోడీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు

Cabbage Pakoda: కర కరలాడే క్యాబేజీ పకోడీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు
Advertisement

Cabbage Pakoda: వర్షాకాలంలో కానీ..చల్లని సాయంత్రం వేళలో కానీ వేడి వేడి పకోడీలు తింటే ఆ రుచే వేరు.సాధారణంగా ఉల్లిపాయ పకోడీలు తయారు చేస్తారు. కానీ క్యాబేజీతో చేసే పకోడీలు అదనపు రుచిని, మంచి క్రిస్పీనెస్‌ను ఇస్తాయి. క్యాబేజీ పకోడీ తయారీ విధానం చాలా సింపుల్ . చాలా తక్కువ సమయంలో తయారు చేయగలిగే అద్భుతమైన స్నాక్ క్యాబేజీ పకోడీ. ఇంతకీ దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

కావాల్సిన పదార్థాలు :
క్యాబేజీ తురుము- 2 కప్పులు
శనగపిండి- 1 కప్పు
బియ్యప్పిండి- 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు- 1 చిన్నది
పచ్చిమిర్చి ముక్కలు- 2-3
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్
కరివేపాకు- 1 రెబ్బ
కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్లు
కారం- 1 టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
జీలకర్ర- 1/2 టీస్పూన్
గరం మసాలా- 1/4 టీస్పూన్
వేడి నూనె- డీప్ ఫ్రైకి సరిపడా

Advertisement

తయారీ విధానం: ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి, చాలా సన్నగా, పొడవుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి. ఈ క్యాబేజీ తురుముపై రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు వేసిన తర్వాత క్యాబేజీ నుంచి సహజంగా నీరు బయటకు వస్తుంది. దీనిని 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పకోడీలు మరింత మృదువుగా, రుచిగా వస్తాయి. క్యాబేజీ ఉన్న గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి. క్యాబేజీలో ఇప్పటికే కొంత తేమ ఉంటుంది కాబట్టి.. అవసరాన్ని బట్టి చాలా తక్కువ నీటిని (ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు) మాత్రమే చిలకరించండి.

Also Read: పడుకునే ముందు ఆపిల్ తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

Advertisement

పిండి గట్టిగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. పకోడీ మిశ్రమం వదులుగా ఉండకూడదు. పిండి క్యాబేజీ ముక్కలకు బాగా పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి, మీడియం మంటపై బాగా వేడి చేయండి. నూనె సరిగ్గా వేడెక్కిన తర్వాత.. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతితో తీసుకొని నూనెలో నెమ్మదిగా వేయండి. ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. పకోడీలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి, బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. మంటను మధ్యస్థంగా ఉంచడం వల్ల పకోడీలు లోపల కూడా బాగా ఉడుకుతాయి. వేగిన పకోడీలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోండి. అవేడి వేడి క్రిస్పీ క్యాబేజీ పకోడీలను టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో కలిపి సర్వ్ చేయండి. ఇది సాయంత్రం టీతో అద్భుతమైన కాంబినేషన్.

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×