E-Paper
Advertisement

Delhi Airport Drug Bust: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం.. NIA అధికారిణి వేషంలో కిలాడీ లేడీ

Delhi Airport Drug Bust: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం.. NIA అధికారిణి వేషంలో కిలాడీ లేడీ
Advertisement

Delhi Airport Drug Bust: దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. సినిమాని తలపించే సంఘటన చోటుచేసుకుంది. బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ దగ్గర భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు సుమారు 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దాని మార్కెట్‌ విలువ సుమారు రూ.12 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ఈ సంఘటనలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ మహిళ తనను NIA అధికారి అంటూ చెప్పుకోవడం. లగేజీ తనిఖీ సమయంలో ఆమె కస్టమ్స్ అధికారులను బెదిరించి, నేను అధికారిక పనిమీద వచ్చాను అంటూ ఫేక్ ఐడీ కార్డు చూపించింది.

Advertisement

కస్టమ్స్ సిబ్బంది మొదట్లో కొంతసేపు గందరగోళానికి గురయ్యారు. అయితే ఆమె ప్రవర్తన, మాట్లాడే ధోరణి చూసి అధికారులకు అనుమానం రేకెత్తించింది. వెంటనే ఆమె చూపించిన ఐడీ కార్డు వివరాలను స్కాన్ చేయగా అది పూర్తిగా నకిలీ అని తేలింది. ఇదే సమయంలో ఆ మహిళ అకస్మాత్తుగా వాష్‌రూమ్ వైపుకు వెళ్లి, లోపల నుండి NIA జాకెట్ వేసుకుని బయటకు రావడానికి ప్రయత్నించింది.

ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను అడ్డగించి, అదుపులోకి తీసుకున్నారు. వెంటనే CISF, కస్టమ్స్‌ టాస్క్ ఫోర్స్ కలిసి ఆమె లగేజీని తిరిగి తనిఖీ చేశారు. అందులో ప్రత్యేకంగా తయారు చేసిన డబుల్‌ లేయర్‌ సూట్‌కేస్‌లో సీల్డ్‌ ప్యాకెట్ల రూపంలో గంజాయి దాచినట్లు గుర్తించారు.

Advertisement

పట్టుబడిన మహిళ దగ్గర నుండి ఫేక్‌ NIA ఐడీ కార్డు, ఫోటోతో కూడిన పాస్‌, NIA లోగో ఉన్న జాకెట్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆమె ఈ ఫేక్ ఐడీని డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ చేసిందని, ఆన్‌లైన్‌లో స్పెషల్ ఏజెన్సీ యూనిఫాం కొనుగోలు చేసిందని వెల్లడైంది.

Also Read: ఘోర ప్రమాదం.. కూలిన రైల్వే బ్రిడ్జి, 12 మంది దుర్మరణం

మహిళతో కలిసి మరో ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి ప్రయాణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అధికారులు వారిని కూడా గుర్తించి విచారణకు పిలిచారు. ఈ గ్యాంగ్‌ భారత్‌లోకి పెద్ద ఎత్తున విదేశీ గంజాయి, LSD, ఇతర నార్కోటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే నెట్‌వర్క్‌లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×