BigTV English

Chapati On Gas: చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే

Chapati On Gas: చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే

Can Cooking Chapati On Direct Flame Leads To Cancer: చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికి తెలిసిందే. ఇందులో కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడతాయి. రోటీలను మన ఇండియాలో ఎక్కువగా తింటారు. దక్షిణాదిన కొంచె తక్కువగానే తిన్నా ఉత్తరాదిలో మాత్రం రోటీలను ఎక్కువగా తీసుకుంటారు. సాధారణంగా రోటీలను గ్యాస్ మంటపై నేరుగా కాలుస్తుంటారు. కానీ నేరుగా మంటపై చపాతీలను కాల్చి తింటే కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


చపాతీలను కానీ, ఏ పదార్ధం అయిన సరే నేరుగా గ్యాస్ మంటపై కాల్చినవి తింటే కాన్సర్‌కు కారణమయ్యే అకిలామైడ్, హెటిరో సైక్లిక్ అమైన్లు ఉత్పత్తి అవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. మాంసాన్ని కూడా నేరుగా గ్యాస్ మంటపై కాల్చడం వల్ల తొందరగా కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాన్సర్ బారినపడకుండ ఉండేందుకు డాక్టర్లు కొన్ని సలహాలు, చిట్కాలు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దాం

రోటీలు ఎక్కువగా కాలిపోకుండా చూడాలి
గ్యాస్ మంటపై రోటీలు కాలుస్తున్నప్పుడు ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ తినే ముందు నల్లగా మాడిపోయింది తొలగించి.. తినాలని సూచిస్తున్నారు.


గ్యాస్ స్టవ్ మీద కాల్చకూడదు
గ్యాస్ మంట ఆరోగ్యానికి హాని కలిగించే వాయు కాలుష్యాలను విడుదల చేస్తాయి. శ్వాస, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నేరుగా గ్యాస్ మంటపై కాల్చకుండా పెనం పెట్టి చేసుకుంటే మంచిది.

పెనంపై కాల్చాలి
రోటీలను నేరుగా గ్యాస్ మంటపై కాకుండా పెనంపై కాల్చి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెనం అధిక ఉష్ణోగ్రతను గ్రహించి తక్కువ మంటతో రోటీలను కాల్చేలా చేస్తుంది. దీని ఫలితంగా పీఎహెచ్ లు, అక్రిలమైడ్ ఉత్పత్తిని నిరోధిస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

Also Read: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

ఆరోగ్యానికి రోటీలు మంచివి
చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీలు తింటే చర్మం హైడ్రేట్ కాకుండా చేస్తాయి. ప్రతిరోజు రాత్రి తపాతీ తినడం వల్ల బరువు తగ్గొచ్చు. గోధుమ పిండితో చేసే రోటీలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి చపాతీ బాగా ఉపయోగపడుతుంది. చపాతీకి ఉపయోగించే గోధుమపిండిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రోటీలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కానీ రోటీలు చేసేటప్పుడు గ్యాస్ మంటపై కాల్చి ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×