BigTV English

Thief Arrested: డిపోలోకి వచ్చి మరీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరకు ఎలా దొరికాడంటే..?

Thief Arrested: డిపోలోకి వచ్చి మరీ.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరకు ఎలా దొరికాడంటే..?

Thief Hijacked RTC Bus arrested: ఇప్పటివరకు మీరు వస్తువును దొంగిలించిన దొంగను చూసి ఉంటారు.. లేదా బైక్ లను దొంగిలించిన దొంగలను చూసి ఉంటారు. కార్లను దొంగిలించిన దొంగలను కూడా చూసి ఉంటారు. కానీ, మీకో విషయం తెలిస్తే షాకవుతారు. అదేమంటే.. ఈ దొంగ గురించి తెలిస్తే నివ్వెరపోతారు. తాను దొంగిలించింది ఏ వస్తువో కాదు.. ఇతను ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లాడు. అది కూడా ఆర్టీసీ బస్సును. పైగా ఆ బస్సును ఎత్తుకెళ్లిందో ఎక్కడో రోడ్డుపై నిలిపినప్పుడు కాదు.. ఏకంగా అతను డిపోలోకి వెళ్లి దర్జాగా ఆ బస్సును ఎత్తుకెళ్లాడు. ఇది గమనించిన కానిస్టేబుల్, స్థానిక యువకులు వెంబడించి అతడిని పట్టుకున్నారు. ఆ తరువాత ఆ దొంగ చెప్పిన మాటలు వింటే మీరు కూడా షాక్ అవుతారు. తాను తాగి ఉన్నానని..  తాగి ఉన్నప్పుడు తాను ఏం చేస్తానో తనకే తెలియదని, ఏ.. తప్పయిపోయిందన్నా.. వదిలేయండి అంటూ పొంతలేని సమాధానం చెబుతున్నాడు. ఇది విన్న వారంతా ఒకేసారి షాకయ్యారు. ఏకంగా బస్సును ఎత్తుకొచ్చి.. అది కూడా డిపోలోకు వెళ్లి. చివరకు పోలీసులకు దొరికే సరికి.. ఈ పొంతనలేని సమాధానాలేంటి? అంటూ ఆశ్చర్యపోయారు.


Also Read: మా ఎమ్మెల్యే కేటీఆర్ కనబడుటలేదు.. వెతికి పెట్టండి: పోలీసులకు ఫిర్యాదు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సు అపహరణకు గురైంది. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గోడదూకి డిపోలోకి వచ్చి నిలిపి ఉన్న బస్సును ఎత్తుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ బైక్ పై ఆ బస్సును వెంబడించాడు. ఈ క్రమంలో మొదటగా ఆ బస్సును అడ్డుకుందామనుకున్నాడు. కానీ, దీంతో ఆ దొంగ బస్సుతో తనను ఢీకొట్టే అవకాశముందని గమనించాడు. వెంటనే విషయాన్ని పై అధికారులకు తెలియజేశాడు. ఇటు స్థానిక యువకులు కూడా ఆ బస్సును వెంబడించారు. వీరిని గమనించిన ఆ దొంగ బస్సును వేగంగా తీసుకెళ్తూ బస్సును ప్రమాదానికి గురిచేశాడు.


దీంతో ఆ బస్సు అక్కడే ఆగిపోయింది. ఆ తరువాత ఆ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు సంబంధంలేని సమాధానాలు చెప్పసాగాడు. తాను మహారాష్ట్రకు చెందిన వ్యక్తినని, తనకు ఏం జరిగిందో తెలియదని, తాను ప్రస్తుతం తాగి ఉన్నానని, తనకు తెలియకుండానే బస్సు స్టీరింగ్ తన చేతిలోకి వచ్చిందని, దీంతో ఆ స్టీరింగ్ ను తిప్పేశానంటూ పొంతలేని సమాధానం చెబుతుంటే విని అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం అతడు మద్యం మత్తులో ఉన్నాడని, ఆ మత్తు దిగినంక అతడిని పూర్తి స్థాయిలో విచారించి, కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. ఈ అంశంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు సంబంధిత అధికారులు ఇటువంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఆర్టీసీ డిపోల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: సామాన్యులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.. ఎంతంటే?

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×