BigTV English

Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?

Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?

Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత(Samantha) ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె నాగచైతన్య(Nagachaitanya)కు విడాకులు (Divorce) ఇచ్చిన తర్వాత సినిమాలకు కాస్త దూరమయ్యారు. విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత అనంతరం మయోసైటిసిస్ అనే వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.


మరో స్పెషల్ సాంగ్ లో సమంత?

ఇక ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వరుస వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషీ సినిమాలో నటించి సందడి చేశారు. ఇక ఈమె విడాకుల తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా(PushpaMovie)లో ఉ అంటావా మామ ఊ.. ఊ అంటావా అంటూ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా మొదటిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్(Special Song) చేసే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. అయితే విడాకుల తర్వాత ఈమె ఇలా స్పెషల్ సాంగ్ చేయడంతో కొంతమంది విమర్శలు కూడా కురిపించారు.


పెద్ది స్పెషల్ సాంగ్ లో సమంత…

ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈమె మరోసారి స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ (Ramcharan) హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా (Peddi Movie)లో మరోసారి స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెద్ది…

ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తున్నారు అయితే బుచ్చిబాబు కూడా అద్భుతమైన స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని ఈ సినిమాలో సమంత అయితే బాగుంటుందని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక చిత్ర బృందం సమంతను సంప్రదించడంతో ఆమె కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. మరి నిజంగానే సమంత రామ్ చరణ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో సందడి చేయబోతున్నారా? అనేది తెలియాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పెద్ది టీమ్ ఈ విషయాన్ని ఎక్కడ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. వచ్చే వారంలో చిత్ర బృందం శ్రీలంకలో సరికొత్త షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎంతో విభిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×