Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ అంటేనే అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక. ఈ పవిత్రమైన పండగ రోజు మీ సోదరుడికి రాఖీ కట్టి, ఆశీర్వదించి, మీ ప్రేమను చాటుకోండి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేయండి.
1. నాకు తోడుగా, నీడగా ఉండే అన్నయ్య నీకు రాఖీ పండగ శుభాకాంక్షలు. నీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ నాకు బలం.
2. కష్టసుఖాల్లో నాకు తోడుగా నిలిచే నా ప్రియమైన తమ్ముడికి రాఖీ పండగ శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను.
3. నా జీవితంలో నువ్వు ఉండటం నా అదృష్టం. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.
4. ఈ రాఖీ మన అనుబంధానికి ఒక గుర్తు మాత్రమే కాదు. నీ రక్షణకు నా ప్రేమకు చిహ్నం. రాఖీ పండగ శుభాకాంక్షలు తమ్ముడు.
5. ఎన్నాళ్లయినా..ఎన్నేళ్లయినా చెరిగిపోని బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధం రాఖీ పండగ శుభాకాంక్షలు.
6. అన్నయ్యకు చెల్లి బాధ్యత కావచ్చు . కానీ చెల్లెలికి అన్నయ్య బలం. రాఖీ పండగ శుభాకాంక్షలు.
7. అమ్మలో సగమై, నాన్నలో సగమై.. అన్నవై, అన్నీ నీవై
నన్ను కంటి పాపలా చూసుకునే అన్నయ్యా నీకు రాఖీ పండగ శుభాకాంక్షలు.
8. అన్నయ్యా.. చిరునవ్వుకి చిరునామావి నువ్వు,
మంచి మనస్సుకు రూపానివి నువ్వు,
మమతకు ప్రాకారానివి నువ్వు,
అప్యాయతకు నిదర్శనం నువ్వు,
రాఖీ పండగ శుభాకాంక్షలు !
9. అనురాగం పంచే అన్నా తమ్ముళ్లకు ,
అప్యాయతను పంచే అక్కాచెల్లెల్లకు
రాఖీ పండగ శుభాకాంక్షలు !
10. మన మధ్య ఉన్న ప్రేమ బంధం ప్రతి ఏడాది బలపడుతూనే ఉంది.
మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ రాఖీ పండగ శుభాకాంక్షలు తమ్ముడు.
11. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండగ సందర్భంగా మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు.
12. సోదర, సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటే రాఖీ పండగను ఆందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరుకుంటూ రాఖీ పండగ శుభాకాంక్షలు .
13. అన్నయ్యను మించిన ధైర్యం, అక్కాచెల్లెళ్లను మించిన స్నేహితులు ఎవ్వరూ ఉండరు. రాఖీ పండగ శుభాకాంక్షలు