BigTV English

Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?

Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?

Film industry: సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన తర్వాత కొంతకాలానికి హీరోగా లేదా హీరోయిన్ గా అవతారం ఎత్తడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం స్కూల్లో చదువుతున్నప్పుడే హీరోయిన్ గా సినిమాలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు తెలుగమ్మాయి ఆనంది (Anandi). ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత తమిళ్లో కూడా అవకాశాలు రావడంతో అక్కడ కూడా పలు చిత్రాలు చేసింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలుగులో ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. అలా హీరో సత్యదేవ్ (Sathyadev) తో కలిసి ఈమె తాజాగా చేసిన వెబ్ సిరీస్ అరేబియా కడలి.


స్కూల్లో చదువుతున్నప్పుడే హీరోయిన్ గా మారాను – ఆనంది

ఆగస్టు 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంది.. తాను సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చింది ? అనే విషయాన్ని తెలిపింది. ఆనంది మాట్లాడుతూ..” అనుకోకుండా నేను యాక్టర్ అయ్యాను. నా మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ చేసేటప్పుడు నేను కేవలం 9వ తరగతి మాత్రమే చదువుతున్నాను. ఆట జూనియర్స్ షోలో పార్టిసిపేట్ కూడా చేశాను. ఆ షో చూసి మారుతి నాకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత వెంటనే మారుతి ‘బస్ స్టాప్’ సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మొదటి నాలుగు సినిమాల వరకు ఏదో చేస్తున్నాను.. వెళ్తున్నాను.. వస్తున్నాను అని మాత్రమే అనుకున్నాను.


నటనే నా జీవితం అనుకోలేదు – ఆనంది

నటనే నా జీవితం అని ఆలోచించలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా అప్పుడు లేదు. ఏదో నా కెరియర్ లో ఇదొక పార్ట్ అనిపించింది. నేను చదువుకోవాలి షూటింగ్స్ వద్దు అనుకునేదాన్ని. కానీ వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత సినిమాలు చేయడం మొదలు పెట్టాను. తమిళ్ కి వెళ్ళక అక్కడ డైరెక్టర్స్ వల్ల నటననే వృత్తిగా ఎంచుకున్నాను. సినిమా గురించి నేర్చుకున్నాను. సినిమాలు చేస్తూనే చదువు పూర్తి చేశాను. ఎంబీఏ పూర్తయింది” అంటూ తెలిపింది ఆనంది. ప్రస్తుతం ఆనంది చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చదువుకునే వయసులోనే హీరోయిన్గా మారడంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు

ఆనందికి పెళ్లయి, కొడుకు ఉన్నాడని మీకు తెలుసా?

హీరోయిన్ ఆనంది కెరియర్ విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ లో తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె.. తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్గా మంచి పేరు సొంతం చేసుకుంది. ఈమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక ఆనందిగా తన పేరును మార్చుకుంది. తన నటనతో జ్యూరీ మెంబర్స్ ని కూడా మెప్పించి.. పలు స్పెషల్ అవార్డ్స్ అందుకున్న ఆనంది.. 2021 జనవరి 7న తెలంగాణలోని వరంగల్ లో సోక్రటీస్ ను వివాహం చేసుకుంది. ఈయన మెరైన్ ఇంజనీర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, తత్వవేత్తగా పనిచేస్తున్నారు. ఇక ఆనందికి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Rajamouli: బయటపడ్డ రాజమౌళి కొత్త సెంటిమెంట్.. హీరోల మెడలో ఆ లాకెట్ ఉండాల్సిందేనా?

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×