BigTV English

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

SEBI – Foreign Funds: భారత పెట్టుబడిదారులు… ముఖ్యంగా సాధారణ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కి విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి కొత్త అవకాశాలు త్వరలోనే రానున్నాయి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా – SEBI తాజాగా కొన్ని సడలింపులతో కూడిన ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలతో విదేశీ పెట్టుబడుల వైపు మరింత సులభంగా అడుగులు వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా International Financial Services Centre – IFSC లో ఉన్న రిటైల్ స్కీమ్స్‌కి కొత్త మార్గం చూపించబడింది. ఇప్పటి వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే కఠినమైన అర్హతలు ఉండేవి. కానీ ఇప్పుడు భారతీయ కంపెనీలు Sponsor మరియు Manager పాత్రలో రిజిస్టర్ అయి Foreign Portfolio Investors – FPIs గా పనిచేసే అవకాశం ఇవ్వాలని SEBI సూచిస్తోంది. IFSC నిబంధనల ప్రకారం పెట్టుబడి పరిమితి 10% గానే కొనసాగుతుంది. అంటే, ఒక పెట్టుబడిదారు మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 10% మాత్రమే ఈ మార్గంలో పెట్టుబడి పెట్టగలరు.


SEBI మరో కీలక సూచన

ఇప్పటివరకు Sponsor మరియు Manager అనే పదాలు ఉపయోగిస్తున్న చోట Fund Management Entity లేదా Associate అనే పదాలతో భర్తీ చేయాలని ప్రతిపాదించింది. దీని వలన నిబంధనలు మరింత స్పష్టతతో అమలవుతాయని, పెట్టుబడిదారులకు కూడా క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.


ఇంకో ముఖ్యమైన అంశం

భారతీయ మ్యూచువల్ ఫండ్స్‌కి విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఇప్పటివరకు పరిమితంగానే ఉండేది. కానీ ఇప్పుడు, భారత మార్కెట్‌తో సంబంధం ఉన్న India Exposure కలిగిన విదేశీ ఫండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని SEBI ప్రతిపాదించింది. అంటే, విదేశాల్లో రిజిస్టర్ అయినా… వాటి వ్యాపారం, ప్రాజెక్టులు, లేదా పెట్టుబడులు భారతదేశంతో సంబంధం ఉంటే… వాటిలో మన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్రతిపాదనలన్నింటిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు SEBI కోరుతోంది. 2025 ఆగస్టు 29 లోపు ఈ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని తమ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అంటే, పెట్టుబడిదారులు, నిపుణులు, లేదా ఫైనాన్స్ రంగంలోని సంస్థలు… తమ అభిప్రాయాలను ఈ గడువులోపు పంపాలి.

ఈ మార్పులు ఆమోదం పొందితే, భారతీయ పెట్టుబడిదారులకు ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే దారులు మరింత విస్తరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ అనుభవం, డైవర్సిఫికేషన్, మరియు అధిక లాభాల అవకాశాలు అందుబాటులోకి రావచ్చు. అయితే, విదేశీ పెట్టుబడులు పెట్టేప్పుడు కరెన్సీ మార్పిడి రిస్క్, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మరియు చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. “SEBI ప్రతిపాదనలు ఆమోదం పొందితే… భారత పెట్టుబడిదారులు విదేశీ మార్కెట్లలో మరింత బలంగా అడుగుపెడతారా? లేక రిస్క్ ఎక్కువై జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందా? వచ్చే నెలాఖరునే దానికి సమాధానం దొరకనుంది.”

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×