IOB notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాసై ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా అందజేపస్తారు. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ఇంపార్టెంట్ డేట్స్, స్టైఫండ్ తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ చెన్నై (IOB) వివిధ రాష్ట్రాల్లో వెకెన్సీ ఉన్న 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 750
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 750 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 20
వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: ఈ అప్రెంటీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ అందజేస్తారు. నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు స్టైఫండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.944 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://iob.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 750
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 20
స్టైఫండ్: నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు స్టైఫండ్
ALSO READ: NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్
ALSO READ: IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..