E-Paper
Advertisement

Black Pepper: దీన్నింకా మసాలా అనుకుంటున్నారా.. శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఫుల్ హెల్త్!

Black Pepper: దీన్నింకా మసాలా అనుకుంటున్నారా.. శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఫుల్ హెల్త్!
Advertisement

Black Pepper: ప్రతి వంటింట్లోనూ కచ్చితంగా నల్ల మిరియాలు ఉంటాయి. ఏ వంటకంలోనైనా మిరియాలు వేస్తే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే. ముఖ్యంగా శీతాకాలంలో మిరియాల చారుని చాలామంది ఇష్టపడి తింటుంటారు. జలుబు చేసినప్పుడు మన వంటింట్లో దొరికే బెస్ట్ మెడిసిన్ ఇదే. నల్ల మిరియాల్లోని ఔషధ గుణాల కారణంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా.. వీటినే శతాబ్దాలుగా మన వంటల్లో వాడుతున్నాం. అందుకే మిరియాలను ‘బ్లాక్ గోల్డ్’ అంటారు. దీనిని మసాలా దినుసుగానే కాకుండా.. శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు ఔషధంగానూ వాడొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

లెక్కలేనన్ని ప్రయోజనాలు:

నల్ల మిరియాలు చూడటానికి చిన్నవిగా అనిపించినా.. వీటితో బోలెడు బెనిఫిట్స్ కలుగుతాయి. ఆహార రుచిని పెంచడంతో పాటు, మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియ నుండి రోగనిరోధక శక్తి వరకు.. నల్ల మిరియాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

Advertisement

Read Also: దానిమ్మతో అదిరే అందం.. ఇలా వాడారంటే దగ దగా మెరిసిపోవాల్సిందే!

చర్మం మెరుస్తుంది: 

అలాగే.. నల్ల మిరియాల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదిస్తాయి. సహజంగా మెరిసే చర్మాన్ని పొందాలంటే.. నల్ల మిరియాలు తీసుకోవచ్చు. కొంతమందికి భోజనం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అలాంటి వారికి నల్ల మిరియాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

Advertisement

నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు నల్లమిరియాలు మానసిక స్థితి, దృష్టి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కొద్ది మొత్తంలో వీటిని తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. నల్ల మిరియాలు జలుబు, శ్లేష్మం నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తాయి. దీనిలోని పైపెరిన్ అనే సమ్మేళనం శరీర శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

నల్ల మిరియాలు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ నల్ల మిరియాలు తీసుకుంటే.. శరీరం తేలికగా, ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. వీటిలోని విటమిన్ సి, ఇతర పోషకాలు శరీరానికి వ్యాధుల నిరోధకతను పెంచుతాయి. దీంతో చలికాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

Read Also: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!

Related News

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

Big Stories

Advertisement
×