E-Paper
Advertisement

Carrot Health Benefits: కంటి చూపు నుంచి క్యాన్సర్ వరకూ.. వారానికి రెండుసార్లు క్యారెట్లు తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే!

Carrot Health Benefits: కంటి చూపు నుంచి క్యాన్సర్ వరకూ.. వారానికి రెండుసార్లు క్యారెట్లు తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే!
Advertisement

Carrot Health Benefits: క్యారెట్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీటా-కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే క్యారెట్లు.. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్‌ సహా పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో కూడా క్యారెట్లు ఎంతో ఉపయోగకరం. అందుకే వారానికి కనీసం రెండుసార్లు క్యారెట్లను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వారానికి రెండు సార్లు:

క్యారెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా వెలువడిన ఓ అధ్యయనం క్యారెట్లపై మరింత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తాజా అధ్యయనం ప్రకారం.. వారానికి సుమారు 2 నుంచి 4 పచ్చి క్యారెట్లు తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 17 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Also Read: వింటర్‌లో పచ్చి బఠాణీలు తింటే ఇన్ని బెనిఫిట్సా!.. శాఖాహారుల బెస్ట్ ప్రొటీన్ అని ఎందుకంటారు?

క్యాన్సర్ ముప్పుకు అడ్డుకట్ట:

కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్ద ప్రేగు (కొలన్) లేదా మలాశయంలో ఏర్పడే క్యాన్సర్. ఇది సాధారణంగా పాలీప్స్ అనే చిన్న పెరుగుదలతో మొదలై, క్రమంగా ప్రమాదకర స్థాయికి చేరుతుంది. ఇలాంటి క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో క్యారెట్లు నిజంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని ఈ అధ్యయనం సూచిస్తోంది.

ప్రయోజనాలు అనేకం:

Advertisement

క్యారెట్లలో కెరోటినాయిడ్స్, లుటీన్, బీటా-కెరోటిన్, విటమిన్ K, విటమిన్ B6 వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించడం, కంటి ఆరోగ్యాన్ని కాపాడటం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు కూడా అందిస్తాయి.

పచ్చిగా తినడం ఉత్తమం:

క్యారెట్లను ఎలా తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. నిపుణుల సూచనల ప్రకారం, క్యారెట్లను పచ్చిగా తినడం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. క్యారెట్ స్వీట్లు, హల్వాలు, పాయసాలు వంటివి రుచికరంగా ఉన్నప్పటికీ, అవి ఆరోగ్య ప్రయోజనాలను అంతగా అందించవు.

అతిగా తీసుకోవద్దు:

క్యారెట్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అతిగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ కాకుండా, వారంలో కనీసం రెండు సార్లు మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, క్యారెట్లను సరైన మోతాదులో, సరైన విధంగా ఆహారంలో చేర్చుకుంటే.. అవి క్యాన్సర్ ముప్పును తగ్గించడంలోనే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.

Also Read: పదే పదే ఆలోచనల్లో పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్‌ ట్రై చేయండి, మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది!

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×