E-Paper
Advertisement

Green Peas Benefits: వింటర్‌లో పచ్చి బఠాణీలు తింటే ఇన్ని బెనిఫిట్సా!.. శాఖాహారుల బెస్ట్ ప్రొటీన్ అని ఎందుకంటారు?

Green Peas Benefits: వింటర్‌లో పచ్చి బఠాణీలు తింటే ఇన్ని బెనిఫిట్సా!.. శాఖాహారుల బెస్ట్ ప్రొటీన్ అని ఎందుకంటారు?
Advertisement

Green Peas Benefits: శీతాకాలం మొదలైందంటే చాలు..  మార్కెట్‌లో పచ్చి బఠాణీలు విరివిగా కనిపిస్తుంటాయి. సాధారణంగా వీటిని కూరల్లో వేసుకునే పదార్థంగానే భావించినా.. నిజానికి ఇవి పోషకాలతో నిండిన పవర్ ఫుడ్. ముఖ్యంగా శాఖాహారులకు అవసరమైన ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్లు ఒకేసారి అందించే పచ్చి బఠాణీలు వింటర్‌లో మన శరీరానికి ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాల గని:

పచ్చి బఠాణీలు చిన్నవైనా.. పోషకాల పరంగా చాలా శక్తివంతమైనవి. వీటిలో విటమిన్ C, ఐరన్, కాల్షియం, ఫోలేట్, ఫైబర్‌తో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా శాఖాహారులకు అవసరమైన ప్రొటీన్‌ను సహజంగా అందించడంలో బఠాణీలు మంచి ఎంపిక. ఇందులో ఉన్న అమైనో ఆమ్లాలు శరీరానికి మేలు చేసి, రోజువారీ ప్రొటీన్ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి.

Advertisement

Also Read: ఆ సమయంలో డార్క్ చాక్లెట్ తింటే లాభమా, నష్టమా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

అనేక సమస్యలకు పరిష్కారం:

పచ్చి బఠాణీల్లో ఫైబర్‌, పొటాషియం అధికంగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్,గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K వంటి పోషకాల కారణంగా ఎముకలు బలంగా ఉండి, వయసు పెరిగే కొద్దీ వచ్చే బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ పచ్చి బఠాణీలు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతోపాటు గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎంచక్కా బరువు తగ్గొచ్చు:

Advertisement

ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవాళ్లు తరచుగా పచ్చి బఠాణీలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే.. బఠాణీల్లో ఫైబర్‌, ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి నియంత్రణలోకి వచ్చి, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేసే పచ్చి బఠాణీలను రోజువారీ ఆహారంలో పరిమితంగా చేర్చుకోవడం మంచిది. అయితే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్తగా డైట్‌లో చేర్చే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Also Read: చలికాలంలో గడ్డ పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరమా?.. వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×