E-Paper
Advertisement

Drugs Case: రకుల్ తమ్ముడు రెగ్యులర్ డ్రగ్స్ కస్టమర్… వార్నింగ్ ఇచ్చినా మారలేదు

Drugs Case: రకుల్ తమ్ముడు రెగ్యులర్ డ్రగ్స్ కస్టమర్… వార్నింగ్ ఇచ్చినా మారలేదు
Advertisement

Drugs Case: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు తరచు డ్రగ్స్ కారణంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇలా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే సౌత్ నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న నటి రకుల్ ప్రీతి సింగ్(Rakul Preeth Singh) సోదరుడు కూడా తరచూ డ్రగ్స్ వివాదంలో నిలుస్తున్నారు. గతంలో కూడా రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్(Aman preet singh) డ్రగ్స్ వివాదంలో నిలిచారు. తాజాగా మరోసారి ఈయన డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

పరారీలో రకుల్ సోదరుడు..

ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్‌ కేసుపై (Drugs Case) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రకుల్ సోదరుడు నిందితుడిగా ఉన్నారు అయితే ఈయన పరారీలో ఉన్న నేపథ్యంలో అమన్ ప్రీత్ సింగ్ కోసం మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఈ కేసు గురించి మాట్లాడుతూ పలు విషయాలను బయటపెట్టారు డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ ప్రీతి సింగ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు అమన్ ఇంకెవరికైనా డ్రగ్స్ అమ్మితే ఫెడ్లర్ గా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ డ్రగ్స్ కేసులో భాగంగా ఇద్దరు ఆఫ్రికన్స్ మహిళలను అరెస్టు చేశామని వీరిని విచారిస్తే రకుల్ సోదరుడు అమన్ తమ కస్టమర్ గా ఉన్నట్లు తెలిపారని శ్రీనివాస్ వెల్లడించారు.

అమన్ కోసం గాలింపు చర్యలు..

Advertisement

అమన్ ప్రీత్ సింగ్ వీరి నుంచి ఇప్పటికే ఐదు సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. నైజీరియన్స్ డేటా, స్టేట్మెంట్ లో అమన్ ప్రీతిసింగ్ తోపాటు మరో నలుగురు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని చింతమనేని శ్రీనివాస తెలిపారు. ఈ కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే అమన్ అందుబాటులో లేరని అమన్ కోసం ప్రత్యేకం టీం గాలింపు చర్యలను చేపట్టినట్లు తెలియజేశారు. అమన్ తో పాటు మరో ముగ్గురు కస్టమర్స్ పై ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని తెలిపారు.

ముంబై కేంద్రంగా డ్రగ్స్ సరఫరా..

Advertisement

నైజీరియన్స్ ఈజీ మనీ కోసమే డ్రగ్ సరఫరా చేస్తున్నారని, ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమన్ ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం రెండో సారీ అమన్ తో పాటు ఈ కేసులో ఉన్న కస్టమర్స్ ను విచారణ చేస్తే తప్పనిసరిగా మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. పోలీసులు హెచ్చరికలతో కస్టమర్స్ లో ఏమాత్రం మార్పు లేదని, రోహబిలిటేషన్ , కౌన్సిలింగ్ ద్వారా ఒక అవకాశం చట్టం కల్పిస్తుంది అయితే దీనిని అవకాశంగా తీసుకొని మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటే మాత్రం కఠినమైన చర్యలు తప్పవు అంటూ వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read: Vanaveera film: వనవీర ప్రీ క్లైమాక్స్ లో స్టార్ హీరో క్యామియో.. ఈ ట్విస్ట్ ఏంటీ?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×