Indian Railways Train Timings Changed: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం ఇచ్చింది. నవంబర్ నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేయనున్నారు. మొత్తం ఎనిమిది రైళ్లకు సంబంధించిన కొత్త టైమింగ్స్ వేర్వేరు తేదీల్లో అమల్లోకి రానున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించే వారు ముందుగానే కొత్త సమయాలను తెలుసుకుని స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
17290 నంబర్ గల మైసూరు–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరులో సమయం నవంబర్ 7 నుంచి మారుతుంది. ప్రస్తుతం ఈ రైలు మధ్యాహ్నం 3:51 గంటలకు గుంటూరు చేరుకుని 3:56 గంటలకు బయలుదేరుతుంది. ఇకపై మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని 3:05 గంటలకు బయలుదేరుతుంది. అదే విధంగా 17296 హిసార్–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా గుంటూరులో సమయాలు మారనున్నాయి. నవంబర్ 6 నుంచి ఈ రైలు సాయంత్రం 3:40 గంటలకు చేరుకుని 3:45 గంటలకు బయలుదేరుతుంది. ప్రస్తుతం ఈ సమయం 4:11 నుంచి 4:16 గంటల వరకు ఉంది.
17444 చర్లపల్లి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ సమయాల్లో కూడా నవంబర్ 6 నుంచి మార్పులు ఉంటాయి. నడికుడిలో ప్రస్తుతం రాత్రి 7:30 గంటలకు చేరుకుని 7:32 గంటలకు బయలుదేరే రైలు.. ఇకపై 7:19 గంటలకు చేరుకుని 7:20 గంటలకు బయలుదేరుతుంది. పిడుగురాళ్లలో 8:05–8:07 గంటల బదులు 7:38–7:40 గంటలకు, మార్కాపూర్ రోడ్‌లో 9:20–9:22 గంటల బదులు 9:05–9:07 గంటలకు రైలు రానుంది. గిద్దలూరులో 10:05–10:07 గంటలకు, దత్తుమెట్టలో 10:20–10:30 గంటలకు, నంద్యాలలో 11:40–11:45 గంటలకు రైలు ఉండేలా కొత్త షెడ్యూల్ రూపొందించారు.
17251 గుంటూరు–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 4 నుంచి గుంటూరు నుంచి ముందుగానే బయలుదేరుతుంది. ప్రస్తుతం సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరే ఈ రైలు.. ఇకపై సాయంత్రం 6 గంటలకే బయలుదేరుతుంది.
20630 తిరువనంతపురం నార్త్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు సత్తెనపల్లిలో నవంబర్ 4 నుంచి కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి. ఉదయం 6:54–6:55 గంటల బదులు 6:44–6:45 గంటలకు రైలు అక్కడ ఆగుతుంది. 17625 కాచిగూడ–రేపల్లె ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్లలో ఉదయం 2:51–2:52 గంటల బదులు 2:41–2:42 గంటలకు చేరుకుని బయలుదేరుతుంది. 17078 తిరుచిరాపల్లి–చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి స్టేషన్లలో సమయాలు మారతాయి. గుంటూరులో 3:05–3:15 గంటల బదులు 2:40–2:50 గంటలకు, సత్తెనపల్లిలో 3:19–3:20 గంటలకు, నడికుడిలో 3:59–4 గంటలకు రైలు ఉంటుంది. అలాగే 17042 తిరువనంతపురం నార్త్–చర్లపల్లి ఎక్స్ ప్రెస్ గుంటూరులో సాయంత్రం 5–5:10 గంటలకు, సత్తెనపల్లిలో 5:45–5:46 గంటలకు రానుంది.
సో, ప్రయాణానికి ముందు రైల్వే అధికారిక షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించి, కొత్త సమయానికి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!