E-Paper
Advertisement

Cholesterol: వీటిని తిన్నారంటే ఒంట్లోని కొలెస్ట్రాల్ కట్ అవ్వాల్సిందే

Cholesterol: వీటిని తిన్నారంటే ఒంట్లోని కొలెస్ట్రాల్ కట్ అవ్వాల్సిందే

మారిపోయిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా చేరిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌గా పిలిచే ఎల్‌డీఎల్ (LDL) ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్, రక్తనాళాల సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనిని తగ్గించాలంటే మందులు వాడాలనుకుంటారు ఎంతో మంది. ఆహారపు అలవాట్లు మార్చుకుని కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. తినే ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ కట్ చేసుకోవచ్చు. ఆహార నిపుణులు సూచిస్తున్న ప్రకారం రోజువారీ భోజనంలో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ (HDL) పెరుగుతుంది.

ఓట్స్, బార్లీ, చేపలు
కొలెస్ట్రాల్ తగ్గించడంలో మొదటి స్థానంలో ఉండేది ఓట్స్, బార్లీ గింజలే. వీటిలో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది.ఇది చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలో శోషించకుండా అడ్డుకుంటుంది. ఉదయం అల్పాహారంగా ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సాల్మన్, సర్డైన్, మాకరెల్ వంటి చేపల్లో ఉండే ఓమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలో కొవ్వు శాతం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ట్రైగ్లిసరైడ్స్‌ను తగ్గించి గుండెను బలంగా ఉంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

గ్రీన్ టీ, వెల్లుల్లి
అలాగే బాదం, వాల్‌నట్, పిస్తా వంటి నట్లు, అలాగే అవిసె గింజలు, చియా గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే మంచి కొవ్వులు రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. రోజుకు చిన్న ముత్తె నట్లు తినడం సరిపోతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. వంటల్లో సాధారణంగా వాడే వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్‌కు శత్రువే. వెల్లుల్లిలో ఉండే ఆలిసిన్ అనే పదార్థం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజువారీ వంటల్లో వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిది.

Also Read: https://www.bigtvlive.com/lifestyle/does-eating-too-much-tamarind-thin-the-blood-facts-and-myths.html

అవిసె గింజలు, చియా గింజలు
ఈ గింజల్లో ఫైబర్, ఓమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వును బంధించి శరీరం బయటకు వెళ్లేలా చేస్తాయి. పెరుగు, మజ్జిగ, స్మూతీల్లో కలిపి తీసుకోవచ్చు. పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయి. వారంలో కనీసం నాలుగు రోజులు ఆకుకూరలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వంటల్లో ప్రతిరోజూ పసుపు వాడడం ఉత్తమం.ఇది కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని కర్కుమిన్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడుతుంది. పసుపు పాలు లేదా కూరల్లో పసుపు వాడటం మంచిది. అవొకాడోలో ఉండే మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. సలాడ్స్‌లో లేదా బ్రెడ్‌తో కలిపి తినవచ్చు. పరిమితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రాజ్మా, శెనగలు, మసూర్ పప్పు వంటి పప్పులు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే కాదు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×