E-Paper
Advertisement

IND Vs NZ 1st ODI: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఎంట్రీ…8 నిమిషాల్లో టికెట్లు అన్ని సేల్

IND Vs NZ 1st ODI: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఎంట్రీ…8 నిమిషాల్లో టికెట్లు అన్ని సేల్
Advertisement

IND Vs NZ 1st ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( INDIA Vs NEW ZEALAND ) మధ్య మరో 10 రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 11వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ మొదటి వన్డే నేపథ్యంలో టికెట్లు అన్నీ హార్ట్ కేకుల్లా సేల్ అయ్యాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు ఈ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో టికెట్లు మొత్తం సేల్ అయినట్లు అధికారిక ప్రకటన రిలీజ్ అయింది.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

IND VS NZ : మొదటి వన్డే టికెట్లు సేల్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే ( INDIA Vs NEW ZEALAND 1st ODI ) జనవరి 11వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. వడోదర లో ఉన్న బిసిఏ స్టేడియం కెపాసిటీ 35000. అయితే ఈ 35 వేల టికెట్లు కేవలం ఎనిమిది నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. ఒక్కటి మిగిలకుండా కొనుగోలు చేశారు అభిమానులు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఎగబడి మరీ అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు.

ఇక ఇదే ఊపు కొనసాగితే జనవరి 14న అలాగే జనవరి 18వ తేదీన మరో రెండు వన్డేలు జరగనున్నాయి. ఆ సందర్భంగా కూడా టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయ్యే ఛాన్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మకు వెళుతుందని చెబుతున్నారు. వన్డే క్రికెట్ కు ఇంత మంచి ఆదరణ లభించడం వెనుక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఉన్నారని వివరిస్తున్నారు. ఈ ఇద్దరు దగ్గర క్రికెటర్లు ఉంటే అభిమానులు ఎగబడి క్రికెట్ చూస్తారని స్పష్టం చేస్తున్నారు.

వన్డే క్రికెట్ బతకాలంటే రోకో ఆడాల్సిందే

Advertisement

వన్డే క్రికెట్ బతికి ఉండాలంటే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడాల్సిందేనని చెబుతున్నారు మాజీ క్రికెటర్లు. ఇదే విషయాన్ని తాజాగా అశ్విన్ కూడా చెప్పడం జరిగింది. వన్డే క్రికెట్ ప్రస్తుతం ప్రమాద స్థితిలో ఉందని వెల్లడించారు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఆయన అంచనా వేశారు. ఒకవేళ వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే, వన్డే క్రికెట్ చూసే వారి సంఖ్య అమాంతం పడిపోతుందని హెచ్చరించారు రవిచంద్రన్ అశ్విన్ (Ravichadran ashwin). కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కువ రోజులు వన్డే క్రికెట్ ఆడేలా చూడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×