E-Paper
Advertisement

Highest Score in ODI: చరిత్రలో ఇదే తొలిసారి.. 50 ఓవర్లలో 574 పరుగులు

Highest Score in ODI:  చరిత్రలో ఇదే తొలిసారి.. 50 ఓవర్లలో 574 పరుగులు

Highest Score in ODI: వన్డే క్రికెట్ లో సరికొత్త చరిత్ర నమోదయింది. 50 ఓవర్లలో ఏకంగా 574 పరుగులు సాధించి ఓ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ సంఘటన విజయ్ హజారే ట్రోఫీ ( Vijay Hazare Trophy ) మొదటి రోజున నమోదయింది. వన్డే హిస్టరీలో బీహార్ జట్టు తొలిసారి 500 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ 500 పరుగులను కేవలం 45 ఓవర్లలోనే చేరుకొని దుమ్ము లేపింది. విజయ్ హజారే ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ వర్సెస్ బీహార్ ( Arunachal Pradesh vs Bihar, Plate ) జట్ల మధ్య ఇవాళ తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన బీహార్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 574 పరుగులు సాధించింది. ఇందులో ముగ్గురు సెంచరీలు చేయడం గమనార్హం.

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 పరుగులు

విజయ్ హజారే ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ బీహార్ వర్సెస్ అరుణాచల్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. రాంజీలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బీహార్ మొదట బ్యాటింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బీహార్ జట్టు అద్భుతంగా రానించి 574 పరుగులు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లు ఆడిన బీహార్ జట్టు, 6 వికెట్లు నష్టపోయి 574 పరుగులు సాధించింది. ఈ సందర్భంగా బీహార్ జట్టుకు సంబంధించిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జస్ట్ లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 84 బంతుల్లో ఏకంగా 190 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ.

ఇందులో 15 సిక్స్ లు ఉండగా 16 బౌండరీలు ఉన్నాయి. 226 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు వైభవ్ సూర్య వంశీ. అలాగే ఆయుష్ లోహారుక కూడా సెంచరీ తో అదరగొట్టాడు. 56 బంతుల్లో ఆయుష్ 116 పరుగులు సాధించి దుమ్ము లేపాడు. అతను ఎనిమిది సిక్సర్లతో పాటు 11 బౌండరీలు కొట్టాడు. ఇక కెప్టెన్ గని 40 బంతుల్లో 128 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో 12 సిక్సర్లతో పాటు 10 బౌండరీలు ఉన్నాయి. 320 స్ట్రైక్ రేటుతో గని రఫ్పాడించాడు. ఈ దెబ్బకు 574 పరుగులు క్రాస్ అయ్యింది బీహార్ జట్టు. ఇక బీహార్ విధించిన 574 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ కష్టపడుతోంది. ఇప్పటివరకు ఆరు ఓవర్లు ఆడిన అరుణాచల్ ప్రదేశ్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు సాధించింది.

బీహార్ కెప్టెన్ సకిబుల్ గని సరికొత్త రికార్డు

బీహార్ జట్టు కెప్టెన్ సకీబుల్ గని ( S Gani) సరికొత్త రికార్డు సృష్టించాడు. 40 బంతుల్లో 128 పరుగులు సాధించిన గని, తన సెంచరీని 32 బంతుల్లో ఫినిష్ చేశాడు. లిస్టు ఏ క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అటు వైభవ్ సూర్య వంశీ కూడా ఇదే మ్యాచ్ లో 36 బంతుల్లో సెంచరీ చేయడం గమనార్హం.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

 

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×