E-Paper
Advertisement

New Year 2026: అప్పుడే 2026లో అడుగుపెట్టేసిన ఆ దేశం.. మనం ఏ స్థానంలో ఉన్నామంటే?

New Year 2026: అప్పుడే 2026లో అడుగుపెట్టేసిన ఆ దేశం.. మనం ఏ స్థానంలో ఉన్నామంటే?
Advertisement

New Year 2026: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఒకే సమయంలో జరుగుతుంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే.. భూమి తిరిగే విధానం, టైమ్ జోన్ల కారణంగా కొన్ని దేశాలు ముందుగానే కొత్త ఏడాదిని స్వాగతిస్తే, మరికొన్ని దేశాలు కాస్త ఆలస్యంగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో 2026లోకి మొదటగా అడుగుపెట్టిన దేశం ఏది? భారత్ ఏ స్థానంలో ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2026ను ముందుగా స్వాగతించిన దేశం ఇదే:

Advertisement

ప్రపంచంలో 2026లోకి మొదటగా అడుగుపెట్టిన దేశం కిరిబాటి(Kiribati). పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ చిన్న ద్వీప దేశం, ప్రపంచంలోనే అత్యంత ముందున్న UTC +14 టైమ్ జోన్లో ఉంది. దీంతో  మిగతా దేశాలన్నింటి కంటే ముందే ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా కిరిబాటికి చెందిన కిరిటిమాటి (Christmas Island) ద్వీపం.. ప్రపంచంలో తొలి నూతన సంవత్సర వేడుకలకు కేంద్రబిందువుగా పేరుగాంచింది.

భారత్ స్థానం ఏది?

భారతదేశం.. ఇండియన్ స్టాండర్డ్ టైమ్(UTC+5:30)ను అనుసరిస్తుంది. అందువల్ల కొత్త ఏడాదికి వెళ్లే క్రమంలో భారత్ మధ్యస్థ స్థానంలో ఉంటుంది. మన దేశాని కంటే ముందే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి దేశాల్లో 2026 ప్రారంభం అవుతుంది. మన తర్వాత యూరప్ దేశాలు, ఆపై అమెరికా ఖండంలో న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల క్రమంలో భారత్ సుమారు 60 నుంచి 70వ స్థానం మధ్యలో 2026లోకి ప్రవేశిస్తుంది.

చివరగా 2026ను స్వాగతించే ప్రాంతాలు:

Advertisement

ప్రపంచంలో చివరగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే ప్రాంతాలు అమెరికాకు చెందిన బేకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్. ఇవి Coordinated Universal Time-12 టైమ్ జోన్లో ఉండటం వలన ప్రపంచంలోని చాలా దేశాలు 2026లోకి అడుగుపెట్టిన చాలా గంటల తర్వాత ఇక్కడ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

టైమ్ జోన్ల అద్భుతం ఇదే:

మనమందరం ఒకే భూమిపై ఉన్నప్పటికీ.. టైమ్ జోన్ల కారణంగా నూతన సంవత్సరం ప్రపంచమంతా దాదాపు 26 గంటల పాటు కొనసాగుతుంది. ఒకచోట ఫైర్‌వర్క్స్‌తో 2026కు స్వాగతం పలుకుతుంటే.. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా 2025 చివరి క్షణాలు గడుస్తూనే ఉంటాయి. ఇదే భూమి ప్రత్యేకత.. టైమ్ జోన్ మ్యాజిక్.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×