E-Paper
Advertisement

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!
Advertisement

Karivepaku Kodi Vepudu: సండే వచ్చిందంటే చాలు నాన్-వెజ్ లవర్స్‌కు ముందుగా గుర్తుచ్చేది చికెన్. అయితే ఎప్పుడూ ఒకేలా చేసుకునే.. రొటీన్ చికెన్ కర్రీ కాకుండా, ఈసారి కొంచెం వెరైటీగా టేస్టీగా ఉండేలా కరి వేపాకు కోడి వేపుడు ట్రై చేయండి. కరివేపాకు సువాసన, మసాలాల ఘుమఘుమలతో అదిరిపోయే ఈ కరివేపాకు చికెన్ ఫ్రై టేస్ట్ నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రెండీ రెసిపీ తయారీ విధానం ఇప్పుడు చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

చికెన్-అర కేజీ

Advertisement

కరివేపాకు -గుప్పెడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్

Advertisement

పచ్చిమిర్చి – 4

ఉల్లిపాయలు -2 (సన్నగా తరిగినవి)

పసుపు -అర టీస్పూన్

కారం -1.5 టేబుల్ స్పూన్లు

ధనియాల పొడి -1 టీస్పూన్

గరం మసాలా -అర టీస్పూన్

నూనె -సరిపడా

ఉప్పు-రుచికి సరిపడా

కొత్తిమీర-కొద్దిగా

తయారీ విధానం:

1.ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ తీసుకొని, అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు చికెన్ ముక్కలకు బాగా పట్టి, వేపుడు జ్యూసీగా వస్తుంది.

2. స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి బంగారు రంగు వచ్చే.. వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

3. ఇప్పుడు మనం తీసుకున్న గుప్పెడు ఫ్రెష్ కరివేపాకులో.. సగానికి పైగా ఇక్కడే వేయాలి. నూనెలో కరివేపాకు ఫ్రై అవుతుంటే వచ్చే సువాసన వంటకం రుచిని అమాంతం పెంచేస్తుంది. కరివేపాకు.. క్రిస్పీగా మారేంత వరకు వేయించాలి.

4. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న.. చికెన్‌ను కడాయిలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా కలపాలి. చికెన్‌లో నుంచి నీరు బయటకు వచ్చి, ఆ నీరంతా ఇంకి పోయే వరకు మూత పెట్టి ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మంటను హై ఫ్రై మోడ్‌లోకి మార్చుకోవాలి.

5. చికెన్ బాగా వేగాక అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి పచ్చి వాసన పోయేలా.. రెండు నిమిషాలు ఫ్రై చేయాలి. చివరగా.. మిగిలిన ఫ్రెష్ కరివేపాకును చికెన్ మీద చల్లుకోవాలి. ఇది డిష్‌కి అద్భుతమైన లుక్‌ని, ట్రెండీ టేస్ట్‌ని ఇస్తుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేయాలి.

Also Read: నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

చిట్కాలు:

కరివేపాకును ముందే వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే దించే ముందు వేస్తే మంచి కలర్,క్రంచీనెస్ వస్తాయి.

బోన్‌లెస్ చికెన్‌తో కూడా ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది.

వేడి వేడి అన్నంలోకి, సాంబార్‌తో లేదా రసంతో ఈ కరివేపాకు కోడి వేపుడు.. నంజుకోవడానికి నంబర్ వన్ ఆప్షన్. వీకెండ్‌లో మీ ఫ్యామిలీ కోసం ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి.

Related News

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!

లేఆఫ్ తర్వాత.. రెండేళ్ల కొడుకుతో ఆఫీసుకెళ్లిన ఉద్యోగి, చివరికి ఓ నిజం తెలుసుకున్నాడు

ప్రసవం తరువాత పెరిగిన బరువు తగ్గాలా? ఇంట్లోనే సులభంగా ఈ 3 వ్యాయామాలు చేయండి

ఈ 7 రకాల వ్యక్తులతో గొడవపడితే మీకే నష్టం.. వీరితో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు

గంజాయి, డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతున్నారా? ఈ దురలవాటు మానేయడానికి మార్గాలివే

ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×