E-Paper
Advertisement

Garlic – Honey: అధిక బరువును నియంత్రించే వెల్లుల్లి-తేనె మిశ్రమం.. రోజూ తిన్నారంటే షాకింగ్ రిజల్ట్స్!

Garlic – Honey: అధిక బరువును నియంత్రించే వెల్లుల్లి-తేనె మిశ్రమం.. రోజూ తిన్నారంటే షాకింగ్ రిజల్ట్స్!
Advertisement

Garlic – Honey: ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చే సహజ పదార్థాల్లో వెల్లుల్లి-తేనె మిశ్రమం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ కాంబోలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ-ఇన్‌ఫెక్షన్ లక్షణాలు శరీరాన్ని పలు రోగాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే, దీనిలో శరీరానికి అవసరమైన అనేక రకాల ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వైరల్ ఇన్ఫెక్షన్స్‌ దూరం:

ముఖ్యంగా వెల్లుల్లి-తేనె మిశ్రమం శీతాకాలంలో వచ్చే ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం అందించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. మన రోజువారీ జీవనంలో దీన్ని చేర్చుకోవడం ద్వారా సహజసిద్ధంగానే మన ఆరోగ్యం కాపాడుకునేందుకు ఇదొక మంచి మార్గం అని చెప్పవచ్చు.

Advertisement

Read Also: ఒకే ఉల్లిపాయ.. ఐదు రుచులు! కట్ చేసే విధానాన్ని బట్టి ఫ్లేవర్ ఎలా మారుతుందో తెలుసా?

అధిక బరువుకు చెక్:

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, ఫైబర్ వంటి పదార్థాలు అధిక బరువును నియంత్రించి, త్వరగా బరువు తగ్గడానికి దోహదపడుతాయి. వెల్లుల్లి-తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఊబకాయం తగ్గడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే చాలామంది దీనిని దివ్య ఔషధం అని చెబుతుంటారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే
పరగడుపున వెల్లుల్లి-తేనె మిశ్రమాన్ని తీసుకుంటే.. మన బాడీలో నిల్వ ఉన్న అదనపు కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.

అనేక వ్యాధులకు దివ్యౌషధం:

Advertisement

ఈ కాంబోలో ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన గొంతు వాపు, నొప్పి తగ్గడమే కాకుండా కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు వెల్లుల్లి-తేనె గుండె ధమనుల్లో ఉండే కొవ్వును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఈ మిశ్రమం జీర్ణవ్యవస్థను బలపరచి కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలోనూ ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.

Read Also: ఈ ఆహార పదార్థాలను రీహీట్ చేస్తున్నారా?.. విషంగా మారే ప్రమాదం ఉందని వైద్యుల హెచ్చరిక!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×