E-Paper
Advertisement

Weight Gain: బరువు పెరగడానికి కారణం భోజనం కాదు.. నిద్రలేమి సమస్యే అసలు విలన్ అంటున్న నిపుణులు!

Weight Gain: బరువు పెరగడానికి కారణం భోజనం కాదు.. నిద్రలేమి సమస్యే అసలు విలన్ అంటున్న నిపుణులు!
Advertisement

Weight Gain: నేటి డిజిటల్ యుగంలో చాలామంది నిద్రను తేలికగా తీసుకుంటున్నారు. ఫోన్లు, ఇతర పరికరాల వాడకం వల్ల నిద్ర సమయం గణనీయంగా తగ్గుతోంది. రాత్రివేళ సరైన నిద్ర లేకపోతే శరీరం సరిగా విశ్రాంతి పొందదు. దీని ప్రభావంతో మెటబాలిజం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నిద్రలేమితో బాధపడే వారిలో బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర ఎంతో కీలకం.

నిద్రపట్ల నిర్లక్ష్యం తగదు:

డైట్‌ను క్రమంగా పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తున్నా సరైన నిద్ర లేకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది. నిద్ర తక్కువగా ఉంటే శరీరం అదనపు కొవ్వును సమర్థవంతంగా కరిగించలేదని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకే డైట్ పాటించినా తక్కువ నిద్రపోయినవారిలో కొవ్వు తగ్గుదల గణనీయంగా తక్కువగా కనిపిస్తోంది. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: అమ్మో.. పీకాన్ గింజల్లో ఇంత పవర్ ఉందా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు!

ఆకలి పెరుగుతుంది:

నిద్రలేమి సమస్య వలన శరీరంలోని సహజ జీవగడియారం దెబ్బతింటుంది. దీని ప్రభావంతో హార్మోన్ల సమతుల్యత మారిపోతుంది. శరీరానికి సరైన నిద్ర అందకపోతే ఆకలిని పెంచే హార్మోన్‌ స్థాయి అధికమవ్వడమే కాకుండా.. ఒత్తిడిని పెంచే హార్మోన్స్ కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరం కొవ్వును కరిగించకుండా నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

ఊబకాయం ముప్పు:

Advertisement

ఇలాంటి మార్పుల వల్ల బరువు పెరగడమే కాకుండా.. ఊబకాయం ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు నిద్ర తక్కువగా ఉంటే.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు మరింత తీవ్రమవుతాయి. అందుకే, బరువు తగ్గాలంటే కేవలం డైట్, వ్యాయామం మాత్రమే సరిపోవు. నాణ్యమైన నిద్ర కూడా తప్పనిసరి.

చిన్న చిన్న మార్పులు:

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. రోజుకు కనీసం 7 నుంచి 8 నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి నిద్రపోవడమే కాదు.. మధ్యలో నిద్ర భంగం కాకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. మన రోజూవారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Also Read: అధిక బరువును నియంత్రించే వెల్లుల్లి-తేనె మిశ్రమం.. రోజూ తిన్నారంటే షాకింగ్ రిజల్ట్స్!

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×