Mrithyunjay OTT: తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే హీరో శ్రీ విష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సామజవరగమన సినిమాతో ఒక్కసారిగా హీరోగా మారిన ఆయన.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుత ఆయన నటించిన మృత్యుంజయ్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది.. మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకున్నట్లు రివ్యూలు చూస్తే తెలుస్తుంది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీపై జనాలు నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఓటిపి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం యొక్క ఓటీటీ డీల్ గురించి, అలాగే స్ట్రీమింగ్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మృత్యుంజయ్.. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా.. రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, నంద గోపాల్, కృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు.. ఎప్పుడు కామెడీ హీరోగా కనిపించే ఈయన ఈ చిత్రంలో సీరియస్ లుక్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నిట్లో కూడా విష్ణు సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్ ని సొంతం చేస్తుంది. ఇక ఏ ఓటీటీలోకి వస్తుందన్న విషయాల గురించి ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ భారీ ధరకు డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజైన 4 వారాల తర్వాత స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మూవీ కూడా వచ్చే నెలలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలోనే ఓటీటీ డీటైల్స్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి..
Also Read :భార్యతో బాలు విడాకులు అందుకే తీసుకున్నాడా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
ప్రముఖ న్యూస్ పేపర్ ఆఫీసులో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటాడు శ్రీ విష్ణు.. అయితే అతను ఎలాగైనా సరే న్యూస్ రిపోర్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఆ క్రమంలో తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో కూరుకుపోయిన చిన్నారి నవ్వడం మరిచిపోతుంది. ఆ క్రమంలో ఆ పాప తండ్రి మరణం వెనుక కారణాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తుండగా అదేవిధంగా మరో వ్యక్తి కూడా మరణించడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వరుసగా ఇలా మరణాలు సంభవించడం పై అనుమానాలు వ్యక్తం అవుతాయి. యాడ్స్ సేకరించే ఉద్యోగిగా జై జర్నీ ఎలా సాగింది? మరణించిన వ్యక్తుల ఇంటికి వెళ్లి యాడ్స్ ఎలా సేకరించాడు? తన తండ్రి మరణం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయని జై తెలుసుకుంటాడా లేదా అన్నది అసలు స్టోరీ. సీన్ సీన్కి ఉత్కంఠ గా మారిన ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..