E-Paper
Advertisement

Sweet Corn Vada Recipe: సాయంత్రం పూట వేడి వేడి స్వీట్ కార్న్ గారెలు.. నోట్లో వేసుకోగానే కరిగిపోవాల్సిందే!

Sweet Corn Vada Recipe: సాయంత్రం పూట వేడి వేడి స్వీట్ కార్న్ గారెలు.. నోట్లో వేసుకోగానే కరిగిపోవాల్సిందే!
Advertisement

Sweet Corn Vada Recipe: ఎప్పుడూ చేసుకునే పప్పు గారెలకు బదులుగా.. కాస్త తీపి, కొంచెం కారం కలగలిసి ఉండే ‘స్వీట్ కార్న్ వడలు’ ఆంధ్రాలో చాలా ఫేమస్. వర్షం పడుతున్నప్పుడు లేదా చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఈ వడలు తింటే స్వర్గమే ఇక. టిఫిన్‌గా లేదా భోజనంలో సైడ్ డిష్‌గా కూడా ఇవి అద్భుతంగా సెట్ అవుతాయి. మరి తయారీ విధానంలో ఎలాగో తెలుసుకుందాం పదండి..

కావాల్సిన పదార్థాలు:

ఈ వడల తయారీకి ప్రధానంగా ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు కావాలి. బైండింగ్ కోసం కొద్దిగా బియ్యం పిండి, శనగ పిండి సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు ఉండాలి. నానబెట్టిన శనగ పప్పును కొంచెం వేస్తే వడలకు మంచి టెక్స్చర్ వస్తుంది.

Advertisement

Also Read: క్యాబేజీ తినని వాళ్లు కూడా ఫిదా అవ్వాల్సిందే.. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి!

పిండి కలుపుకునే విధానం:

ముందుగా స్వీట్ కార్న్ గింజలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే, గింజలను మరీ మెత్తగా చేయకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వడలు తింటున్నప్పుడు కరకర సౌండ్ వస్తుంది. ఈ మిశ్రమంలో నానబెట్టిన శనగ పప్పు, బియ్యం పిండి, శనగ పిండి వేసి కలపాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి వడల పిండిలా గట్టిగా కలుపుకోవాలి.

వడల తయారీ ఇలా..

Advertisement

స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడల్లా ఒత్తుకుని, మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయాలి. మంట ఎక్కువగా ఉంటే పైన రంగు వస్తుంది కానీ లోపల కార్న్ సరిగ్గా ఉడకదు. రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసుకుంటే సరిపోతుంది.

Also Read: 10 నిమిషాల్లో అదిరిపోయే బచ్చలికూర రోటి పచ్చడి.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×