E-Paper
Advertisement

Magic Drink: భోజనం తరువాత ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు, ఏ సమస్యా రాదు

Magic Drink: భోజనం తరువాత ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు, ఏ సమస్యా రాదు

ఆధునిక కాలంలో మధుమేహం, గుండె సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నాయి. మందులు, డైట్లు, వ్యాయామం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం నెమ్మదిగా కనిపిస్తుంది. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, మనం భోజనం చేసిన తర్వాత ఒక సింపుల్ డ్రింక్ తాగితే చాలు ఈ సమస్యలన్నింటినీ చాలా వరకు నియంత్రించుకోవచ్చు. ఆ డ్రింక్ వెచ్చని నిమ్మరసం. ఇది ఎంతో చవకగా లభిస్తుంది. రతి ఇంట్లో దొరికే నిమ్మకాయతో తయారు చేసే ఈ పానీయం ఆరోగ్యానికి ఎంత సహాయపడుతుంది.

వెచ్చని నిమ్మరసంతో ఆరోగ్యం
భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగటం చాలామందికి అలవాటు. కానీ చల్లని నీరు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. కానీ వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరం వేడిగా మారి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న చెడు పదార్థాలను క్లీన్ చేయడంలో సహాయపడతాయి. అందుకే భోజనం తర్వాత ఈ ఒక గ్లాస్ నిమ్మరసం చాలా ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహ నియంత్రణ
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి భోజనం తర్వాత షుగర్ స్థాయి ఒక్కసారిగా పెరగడం చాలా ప్రమాదకరం. నిమ్మరసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే రక్తంలో గ్లుకోజ్ స్థాయిలు ఫాస్ట్ గా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే నిమ్మలో ఉండే సిట్రిక్ ఆమ్లం గ్లూకోజ్‌ను మెల్లగా శరీరంలోకి చేరేలా చేస్తుంది. వెచ్చని నిమ్మరసం వల్ల ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరం. డాక్టర్లు కూడా భోజనం తర్వాత నిమ్మరసం తాగడం ద్వారా షుగర్ స్పైక్ తగ్గుతుందని సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి మేలు
నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్తప్రసరణను సరిగా ఉంచుతాయి. అలాగే నిమ్మరసం రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చెడుకొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది.
రోజూ భోజనం తర్వాత ఒక గ్లాస్ వెచ్చని నిమ్మరసం తాగితే రక్తపోటు స్థిరంగా ఉండటానికి కూడా సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు చాలా డైట్లు, హోం రెమిడీలు ప్రయత్నిస్తారు. కానీ భోజనం తర్వాత వెచ్చని నిమ్మరసం తాగటం చాలా ఈజీ పద్ధతి.

పొట్టలో ఉండే ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో శరీరంలో నిల్వ అయ్యే కొవ్వు తగ్గి బరువు క్రమంగా తగ్గుతుంది. అదే కాక భోజనం తర్వాత గుండెల్లో కాలినట్టు అనిపించడం, బిగుతుగా ఉండటం, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నిమ్మరసం తయారుచేయడానికి ఒక గ్లాస్ వెచ్చని నీటి తీసుకోవాలి. అందులో అర చెక్క నిమ్మకాయ రసం పిండాలి. కానీ చక్కెర వేయకూడదు. కావాలంటే కొంచెం తేనె వేసుకోవచ్చు. భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత తాగితే మరింత మంచిది. రోజూ ఇలా తాగితే శరీరం తేలికగా ఉండటమే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి.

నిమ్మరసం మంచి ప్రయోజనాలు ఇస్తుందన్నది నిజమే. కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా పాటించడం మంచిది. రోజూ చాలా ఎక్కువ నిమ్మరసం తాగకూడదు. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉండేవారు ఒకేసారి ఎక్కువగా తాగకూడదు. అల్సర్ ఉన్నవారు డాక్టర్‌ను అడిగి మాత్రమే తాగాలి.

Related News

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

Big Stories

×