E-Paper
Advertisement

Health benefits: వాతావరణం చల్లగా ఉందని టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా?

Health benefits: వాతావరణం చల్లగా ఉందని టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా?
Advertisement

Health benefits: చల్లని ఉదయం, సాయంత్రం వేడి వేడి టీ లేదా కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ హాయే వేరు. అందుకే చాలామంది వాతావరణం కొంచెం చల్లగా ఉంటే చాలు రోడ్డు పక్కన పెట్టే టీ షాపులు కిట కిట లాడేస్తాయి. ఎన్నిసార్లయినా టీ తాగేందుకు సిద్ధమైపోతారు చాలా మంది. రోజులో ఒకట్రెండు సార్లు తాగడం మంచిదే కానీ, మరీ ఎక్కువ సార్లు తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజుకు నాలుగైదు కప్పుల టీ, కాఫీ తాగడం వల్ల మీ శరీరంలో ఎంత కెఫీన్ చేరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది మనం శరీరంపై ప్రతికూలంగా పనిచేయడం మొదలవుతుంది. ఉదయం ఒక కప్పు, మధ్యలో మరో కప్పుతో సరిపెట్టుకోవాలి. సాయంత్రం అయిదు దాటాకా టీ తాగకపోవడమే ఉత్తమం. ఇది నిద్రపట్టకుండా చేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రోజుకు నాలుగైదు కప్పుల టీ తాగడం వల్ల వచ్చే నష్టాలేంటో మీకు తెలుసా?

మలబద్ధకం
చాలా మందికి ఈ సమస్య ఉన్నప్పటికీ, అది టీ, కాఫీలు అధికంగా తాగడం వల్ల కలిగి ఉంటుందని గ్రహించి ఉండరు. టీలో థియోఫిలిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో డీహైడ్రేషన్ అయ్యేలా చేసే రసాయనం. అధికంగా టీ, కాఫీలు తాగినప్పడు మరుసటి రోజు మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. టీ, కాఫీలకు బదులు వేడి నీళ్లు తాగితే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

నిద్ర సమస్యలు
టీ, కాఫీలలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అది మీ మెదడుకు నిద్ర పొమ్మని సంకేతాన్ని మోసుకెళ్లే మెలటోనిన్ హార్మోన్‌‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. కెఫిన్ అధికంగా శరీరంలో చేరితే.. మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకోవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి, దీని ఫలితంగా నిద్ర సరిగా ఉండదు. నిద్ర పట్టకపోతే మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుతారు. కావున టీ, కాఫీలను తక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మానసిక ఆందోళన
శరీరంలో కొంచెంగా చేరిన కెఫీన్ ఉల్లాసాన్ని నింపుతుంది. అదే అధికంగా చేరితే చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. గుండె దడ, గాభరా, నిద్ర సరిగా పట్టకపోవడం, ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుంది.

Advertisement

Also Read: మంచి నిద్ర కావాలా? ఇలా చేస్తే క్షణాల్లో నిద్రపోతారు.

యాసిడ్ రిఫ్లక్స్
ఉదయం పూట ఖాళీ పొట్టతో టీ తాగకూడదని ఎంతో మంది వాదిస్తారు. దీని వల్ల శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ జరిగే అవకాశం ఉంది. మీరు రోజులో రెండుకు మించి టీ, కాఫీలు తాగడం వల్ల కూడా ఇది జరుగుతుంది. రోజులో ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది, ఇది నిద్రలో పీడకలలను వచ్చే అవకాశాన్ని పెంచుతుందని తెలిపారు.

క్యాన్సర్ వచ్చే అవకాశం?
అంతేకాకుండా టీ అధికంగా తాగే మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కాబట్టి మగవారు రోజుకు ఒకసారి టీతో సరిపెట్టుకోవాలిని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×