Good Sleep: ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రతో సతమతమవుతున్నారు. నిద్ర సరిగ్గా పోక పోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. కాని మంచి నిద్ర అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒత్తిడి, ఇతర జీవణశైలి అలవాట్ల వల్ల నిద్ర పోవడం తగ్గిస్తున్నారు. అయితే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా గాఢ నిద్ర కోసం కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీరు తొందరగా నిద్రలోకి జారుతారు.
1. నిద్ర షెడ్యూల్
ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండం వల్ల శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్‌ను క్రమబద్ధం చేస్తుంది. వారాంతాల్లో కూడా ఈ షెడ్యూల్‌ను మార్చకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల శరీరం సహజంగా నిద్రకు సిద్ధమవుతుంది, ఉదయం రిఫ్రెష్‌గా లేవడానికి సహాయపడుతుంది.
2. నిద్రకు అనుకూలమైన వాతావరణం
పడుకునే ముందు గదిలో లైట్లు ఆర్పివేయండి లేదా డిమ్ లైట్లను ఉపయోగించండి. మెలటోనిన్ (నిద్ర హార్మోన్) ఉత్పత్తికి చీకటి అవసరం.శబ్దం లేని వాతావరణంలో నిద్ర పోవడం వల్ల తొందరగా నిద్రపోతారు, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అలాగే గది ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
3. స్క్రీన్‌ల నుండి దూరంగా ఉండండి
పడుకోవడానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్ టాప్ వాడటం వల్ల దాని నుండి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే నిద్రపోయే ముందు కనీసం 1-2 గంటలు స్క్రీన్‌లను ఉపయోగించకుండా ఉండండి. పడుకోవడానికి ముందు పుస్తకం చదవడం, ధ్యానం చేయడం లేదా మృదువైన సంగీతం వినడం వంటివి చేయండి.
4. నిద్ర వేళకు ముందు ఆహారం
చాలామంది నిద్రపోయే ముందు తింటుంటారు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. కావున నిద్రపోయే ముందు 2-3 గంటలు భారీ భోజనం తినకండి. దీని వల్ల జీర్ణ సమస్యలు నిద్రను భంగపరుస్తాయి. కావున నిద్రపోయే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే కెఫీన్ వంటి కాఫీ, టీ లు, ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు, ఆల్కహాల్ అస్సలే తాగకూడదు, వీటిని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. అలాగే నిద్రకు ముందు నీరు కూడా తక్కువగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.
Also Read: కంటిచూపు పెరగడానికి నెంబర్ 1 ఆకు ఏంటో తెలుసా?
5. వ్యాయామం, శారీరక శ్రమ
రోజూ 30 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే రాత్రి 7 గంటల తర్వాత భారీ వ్యాయామం చేయకండి, ఇలా చేస్తే శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది.
6. మానసిక ఒత్తిడి
చాలా మందిని ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన నిద్రను దెబ్బతీస్తున్నాయి. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే పడుకునే ముందు వేడి పాలల్లో తేనే లేదా పసుపు కలిపి తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇది మెలటోనిన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా నిద్రకు ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుందని పలు నిపుణులు చెబుతున్నారు.