Viral Video: ఈ మధ్యకాలంలో పెట్రోల్ పంపుల వద్ద చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఓ మహిళ పంపులో పని చేసే వర్కర్‌పై రివాల్వర్ గురి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు కోపానికి గురైంది? రివాల్వర్‌తో ఎందుకు బెదిరింపులకు దిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
యూపీలోని హర్దోయ్ జిల్లా షాకింగ్ ఘటనకు వేదికైంది. తన తండ్రితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఒక్క కారణంతో ఆ మహిళ పెట్రోల్ పంప్ ఉద్యోగిపై రివాల్వర్ తీసి గురిపెట్టింది. బిల్‌గ్రామ్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో CNG పెట్రోల్ పంప్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
అసలేం జరిగింది.. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి బిల్‌గ్రామ్ ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపు వద్ద వింత పరిస్థితి నెలకొంది. షహాబాద్‌లోని మొహల్లా గిగియా ప్రాంతానికి చెందిన ఎహ్సాన్ ఖాన్ ఆదివారం రాత్రి భార్య హుస్న్‌బానో, కూతురు అరిబా ఖాన్‌తో కలిసి బిల్‌గ్రామ్ నుండి కారులో తిరిగి ఇంటికి వస్తున్నాడు.
మార్గమధ్యంలో సిఎన్‌జి నింపడానికి బిల్‌గ్రామ్ సాండి రోడ్డులోని పెట్రోల్ పంప్ వద్ద ఆగాడు. పంపు ఉద్యోగి రజనీష్.. గ్యాస్ నింపుతున్నప్పుడు కారులో ఉన్న కుటుంబాన్ని దిగమని కోరాడు. ఒకవేళ అనుకోని ఘటన ఏమైనా జరిగితే కారులో ఉన్న వ్యక్తులు ఎగిరిపోతారని చెప్పాడు.ఈ విషయమై ఎహ్సాన్ ఖాన్- ఉద్యోగి మధ్య వివాదం మొదలైంది. అది చిలికి చిలికి గాలివానగా మారింది.
ALSO READ: హనీమూన్ జంట కేసు.. హత్యకు ముందు చివరి వీడియో
వెంటనే కారులో ఉన్న ఎహ్సాన్‌ఖాన్ కూతురు కారు దిగి తనదగ్గరున్న లైసెన్స్ రివాల్వర్ పట్టుకుని వచ్చింది. రివాల్వర్ తీసి పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై పెట్టి బెదిరింపులకు దిగింది. మీ కుటుంబ సభ్యులు గుర్తించలేనంతగా కాల్చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. చివరకు కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని వివాదాన్ని శాంతింపజేశారు.
ఈ వ్యవహారమంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.దీనిపై పెట్రోల్ పంపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎహ్సాన్ ఫ్యామిలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
"इतनी गोली मारूंगी कि घरवाले भी पहचानने से इनकार कर देंगे"
UP के जिला हरदोई में एक कार में CNG भरनी थी। सेल्समैन से कार सवारों को नीचे उतरने को कहा। इस पर विवाद हुआ। महिला ने सेल्समैन के सीने पर रिवॉल्वर तान दी।
महिला अरीबा खां, हुस्नबानो, एहसान खां पर FIR दर्ज, रिवॉल्वर जब्त। pic.twitter.com/KuLAjg48CM
— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025