MissTerious: ప్రముఖ డైరెక్టర్ మహి కోమటిరెడ్డి (Mahi komatiReddy ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టీరియస్’. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సుహాని (Rohit Suhani), రియా కపూర్(Rhea Kapoor), మేఘన రాజ్ పుత్ (Meghana Rajput)ప్రధాన పాత్రల్లో ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆశ్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉష , శివాని నిర్మించిన ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. మరొకవైపు ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. ఇకపోతే త్వరలోనే ఆడియో లాంచ్ ఈవెంట్ ను కూడా షెడ్యూల్ చేశారు. ఈలోగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది.
మిస్టీరియస్ టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatareddy)చేతులమీదుగా ఈ మిస్టీరియస్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ.. “సౌత్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్న ఈ సినిమా సౌత్ లో ఉన్న అన్ని భాషలలో పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. అన్ని పోస్టర్లు కూడా చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను.. మిస్టీరియస్ టీం కి నా శుభాకాంక్షలు” అంటూ మంత్రి తెలిపారు.
యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కోరుకునే వారికి మిస్టీరియస్ ఒక అద్భుతం – డైరెక్టర్
ఈ చిత్ర దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మిస్టీరియస్ సినిమాలో ప్రతి పాత్ర కూడా ఒక అనుమానాదాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరకెక్కించాము. చిత్ర కథ , అద్భుత స్క్రీన్ ప్లే తో రూపొందించిన ఈ చిత్రం.. క్రమక్రమంగా క్లూ లను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా నిలుపుతుంది. ముఖ్యంగా షాకింగ్ ట్విస్ట్ లు, కథను కొత్త ఎత్తులకు తీసుకెళ్లి వీక్షకులను రంజింప చేస్తుంది. ఇక యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కోరుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా టైటిల్, పోస్టర్ లాంచ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ధన్యవాదాలు” అంటూ ఆయన తెలిపారు.
మిస్టీరియస్ మూవీ పై అంచనాలు పెంచిన నిర్మాత..
అంతేకాదు ప్రముఖ ప్రొడ్యూసర్ జయ్ వల్లందాస్ మాట్లాడుతూ..” తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా సినిమా టైటిల్ పోస్టర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు. క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఉత్కంఠను నింపుతుంది. ఈ సినిమా ఒక మాస్టర్ క్లాస్.. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో కలిసి ఈ సినిమా నిర్మించడం ప్రత్యేకంగా భావిస్తున్నాము. ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. సంగీత దర్శకుడు ఎమ్మెల్ రాజా మధురమైన సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా చేస్తాము. వారానికి ఒకటి చొప్పున మూడు పాటలను రిలీజ్ చేస్తాము. మా సినిమాని ఆదరించి ఘనవిజయం చేయాలని కోరుకుంటున్నాము” అంటూ ఆయన తెలిపారు.
also read:Sarkaar 5 Promo: ఏ రోజు నన్ను నిద్రపోనిచ్చావు సుధీర్? ఆ విషయం బయటపెట్టేసిన అరియానా, ఆటగాడే!