E-Paper
Advertisement

మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం

మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం
Advertisement

మెడికల్ రిపోర్స్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తే చాలామంది ఆందోళన చెందుతారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మందులు తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే మళ్లీ సమస్య పరిష్కార మవుతుంది. కానీ కొంతమంది కొలెస్ట్రాల్ ట్యాబెట్స్ తీసుకుంటున్నా సమస్య తగ్గడం లేదని చెబుతుంటారు. దీనికి కారణం ప్రతి రోజూ చేసే చిన్న చిన్న తప్పులు. ఈ తప్పులు చిన్నవే అని అనిపించినా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వాటిని సమయానికి సరిచేస్తే కొలెస్ట్రాల్‌ నియంత్రించవచ్చు.

1. డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపేయడం

కొంతమంది కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గిందని భావించి వైద్యుడిని సంప్రదించకుండా మధ్యలో కొన్ని రోజులు ట్యాబెట్ల్స్ తీసుకోవడం ఆపేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. కొలెస్ట్రాల్ మందులు నిర్దేశించిన విధంగా క్రమం తప్పకుండా తీసుకోవాలి. మధ్యలో ఆపేస్తే కొలెస్ట్రాల్ మళ్లీ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల డాక్టర్ సూచన లేకుండా మందుల మోతాదును మార్చకూడదు లేదా పూర్తిగా ఆపకూడదు.

2. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం

Advertisement

బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు, పకోడీలు, కేకులు, బిస్కెట్లు వంటి ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. వీటి బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఓట్స్, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది.

3. వ్యాయామం చేయకుండా ఎక్కువసేపు కూర్చోవడం

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలు కంప్యూటర్ లేదా మొబైల్ ముందు కూర్చొని చేసే విధంగా ఉంటాయి. దీనివల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. వ్యాయామం చేయకపోతే శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవడం, జాగింగ్ చేయడం లేదా ఇతర వ్యాయామాలు చేయడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

4. తక్కువ నీరు తాగడం, అధిక ఒత్తిడితో జీవించడం

Advertisement

శరీరానికి సరిపడా నీరు తాగడం చాలా అవసరం. తక్కువ నీరు తాగితే శరీరంలోని జీవక్రియలు మందగించే అవకాశం ఉంటుంది. అలాగే నిరంతరం మానసిక ఒత్తిడిలో ఉండటం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు రెండూ పెరిగే ప్రమాదం ఉంది. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సరిపడా నిద్ర కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం.

5. సిగరెట్, మద్యం అలవాట్లు కొనసాగించడం

ధూమపానం, అధిక మద్యపానం గుండె ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. సిగరెట్ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ సులభంగా రక్తనాళాల్లో పేరుకుపోతుంది. అధికంగా మద్యం సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ (ట్రైగ్లిసరైడ్స్), రక్తపోటు పెరుగుతాయి. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

Also Read: క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

6. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం

కొలెస్ట్రాల్‌ను ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ లక్షణాలు కనిపించకుండా శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఒకసారి పరీక్ష చేయించుకున్న తర్వాత చాలా కాలం మళ్లీ పరీక్షలు చేయించుకోకపోవడం ప్రమాదకరం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు వైద్యుడి సలహా మేరకు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల మందులు, ఆహార నియమాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన అలవాట్లే గుండెకు రక్షణ

కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే మందులు మాత్రమే సరిపోవు. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఈ చిన్న మార్పులు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Related News

మీ ఫేస్ కలర్ చామన ఛాయ.. అయితే ఈ 5 లిప్ స్టిక్ షేడ్స్ మీకు సరిపడవు

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

Big Stories

Advertisement
×