Air Cooler Tips| ఎండలు మండుతున్నాయి. వేసవి వేడి కారణంగా అందరూ ఏసీలు, ఎయిర్ కూలర్లు ఉపయోగిస్తున్నారు. ఏసీలు ఖరీదుగా ఉండడంతో పాటు వాటి వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఎయిర్ కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఏసీల కంటే కూలర్లు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కూలర్లు కొన్నిసార్లు వేడి గాలిని వదులుతాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వాటి చల్లదనాన్ని తగ్గిస్తుంది. దీంతో మీ గదిలో అసౌకర్యంగా, తేమగా ఉంటుంది. కానీ సాధారణ చిట్కాలతో మీ గదిని చల్లగా చేయొచ్చు.
కూలర్ నుంచి వేడి గాలి వస్తుంటే ఒక సాధారణ చిట్కాతో గాలిని చల్లగా చేయొచ్చు. కాస్త ఐస్, ఉప్పును కలిపి ఉపయోగించాలి. చాలా తక్కువ ఖర్చుతో ఈ ట్రిక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కూలర్ నీటి ట్యాంకులో ఐస్ ముక్కలు వేయండి. ఐస్‌తో పాటు కొద్దిగా ఉప్పు కలపండి. ఉప్పు మంచును ఎక్కువ సేపు చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. దీంతో నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చల్లని నీరు ఫ్యాన్ నుండి చల్లని గాలిని వీచేలా చేస్తుంది. ఐస్ కరిగేంతవరకు ఏసీ లాంటి చల్లని గాలి వస్తుంది.
ఎయిర్ కూలర్లు ఎవాపరేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. గదిలో వేడిని నీరు గ్రహించి గాలిని చల్లబరుస్తుంది. నీరు చల్లగా ఉన్నప్పుడు, చల్లదనం మరింత ఎక్కువగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రతను మంచు త్వరగా తగ్గిస్తుంది. ఉప్పు వేయడం వల్ల వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ తగ్గుతుంది. ఇది కూలర్ లోపల వాతావరణం ఎక్కువసేపు చల్లగా ఉండేలా చేస్తుంది. ఫలితంగా ఎక్కువసేపు చల్లని గాలి వస్తుంది.
కూలర్లకు మంచి వెంటిలేషన్ చాలా ముఖ్యం. అవి మూసిన గదులలో సరిగా పనిచేయవు. కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచండి. దీంతో తాజా గాలి లోపలికి వచ్చి కూలర్ గాలి గదిలో నలువైపులా వ్యాపించేలా చేస్తుంది. వీలైతే కూలర్‌ని కిటికీ దగ్గర ఉంచండి. క్రాస్ వెంటిలేషన్ చల్లదనాన్ని మెరుగుపరుస్తుంది. తాజా గాలి.. వేడి గాలిని బయటికి నెడుతుంది. ఇది గదిని చల్లగా, సౌకర్యంగా మారుస్తుంది.
Also Read: వేసవిలో వడదెబ్బ ప్రభావం తెలిపే లక్షణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
కూలింగ్ ప్యాడ్లు కూలర్ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మురికి ప్యాడ్లు గాలి ప్రవాహాన్ని, చల్లదనాన్ని తగ్గిస్తాయి. ప్యాడ్లను క్రమం తప్పకుండా నీటితో శుభ్రం చేయండి. ప్యాడ్లు పాతబడితే వాటిని మార్చండి. శుభ్రమైన ప్యాడ్లు నీటిని బాగా గ్రహిస్తాయి. దీంతో గది లోపల చల్లదనం మెరుగుపడుతుంది.
కూలర్ స్థానం దాని పనితీరును చాలా ప్రభావితం చేస్తుంది. దాన్ని కిటికీ లేదా గాలి బాగా వీచే ప్రదేశంలో ఉంచండి. మూసి ఉన్న గది లేదా గదిలో మరీ ఇరుకుగా ఉన్న మూల ప్రదేశంలో ఉంచడం తప్పు. మంచి కూలింగ్ కోసం సరైన గాలి ప్రవాహం అవసరం.