Telangana Govt: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించాలని కార్మికులకు కోరారు. మరో నాలుగు వారాల్లో కమిటీ నివేదిక వస్తుందని దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. మరోవైపు గన్ పార్క్ వద్ద ఈ ఉదయం ఆర్టీసీ జేఏసీ నిరసన తెలిపింది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి డిపోల వద్ద కార్మికులు, నేతలు నిరసనలు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే యథావిధిగా నడుస్తున్నాయి. అయినా సమ్మె ప్రభావం రాష్ట్రంలో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచన చేశారు. సమ్మె.. సమస్యకు పరిష్కారం కాదని, ప్రభుత్వం నలుగురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నాలుగు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని ఎక్స్ వేదికగా తెలిపారు.
కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటని, కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదని తేల్చిచెప్పారు. అవన్నీ వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. కేవలం రెండు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
సమ్మె విరమించండి, 4 వారాల్లో కమిటీ నివేదిక
ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు మాత్రమే ఉన్నాయని, ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉందన్నారు.వీటిపై అధ్యయనం చేయడానికి నాలుగు వారాలు గడువు పడుతుందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో వాటిపై చర్చించాల్సి వుందన్నారు.
ఆర్టీసీ విలీనం ఆలస్యమైనా ఉద్యోగులకు ఒకటిన జీతాలు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను క్లియర్ చేశామన్నారు. నెల వారిగా పీఎఫ్-సిసిఎస్ లకు 75 కోట్లు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగుల పై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలో పూర్తవుతుందన్నారు.
సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో సర్వీసు నుండి తొలగించినవారిని దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదన్నారు.
ALSO READ: పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్ రావులకు రిలీఫ్
గడిచిన పదేళ్లు ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసన్నారు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. మిమ్మల్ని ఎవరు అడ్డుకోరని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపవచ్చారు.
ఆర్టీసి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరపున కొట్లాడి సాధించుకుందామన్నారు. కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటుందని, మీ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నామని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం.
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Minister Ponnam Prabhakar appeals to RTC workers to call off strike https://t.co/9mMUZfpjOB pic.twitter.com/1e5Xc1ue1m
— BIG TV Breaking News (@bigtvtelugu) April 22, 2026