E-Paper
Advertisement

వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. మల్టిపర్పస్ ఏసీ అంటే ఇదే, ధర కూడా తక్కువే!

వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. మల్టిపర్పస్ ఏసీ అంటే ఇదే, ధర కూడా తక్కువే!
Advertisement

Xiaomi Mijia AC 2026: ప్రముఖ టెక్ సంస్థ షావోమీ అంటేనే ముందుగా గుర్తొచ్చేది తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించడం. తాజాగా ఈ కంపెనీ చైనా మార్కెట్లో మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 2026 పేరుతో సరికొత్త 1HP ఎయిర్ కండీషనర్‌ను లాంచ్ చేసింది. ఈ ఏసీ స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఎండాకాలంలో గదిని చల్లబరచడమే కాదు.. చలికాలంలో వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది. ఈ ఏసీ ధర రూ.21,000 లోపే ఉండటం విశేషం.

ఎనర్జీ సేవింగ్‌లో టాప్..

ఈ కొత్త మిజియా ఏసీని షావోమీ తమ సిగ్నేచర్ స్టైల్‌లో చాలా సింపుల్‌గా, తెలుపు రంగులో డిజైన్ చేసింది. ఏ గదిలోనైనా ఇది ఇట్టే కలిసిపోతుంది. పైగా ఈ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి.. కరెంటు బిల్లు గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. చైనాలోని కొత్త రూల్స్ ప్రకారం దీనికి ఎనర్జీ సేవింగ్‌లో టాప్ రేటింగ్ ఇచ్చారు. ఇందులోని లింగ్యున్ అనే స్మార్ట్ సాఫ్ట్‌వేర్ మనం వాడే తీరును బట్టి కరెంటు తక్కువ ఖర్చయ్యేలా చూస్తుంది.

సీజన్ ఏదైనా కంఫర్ట్ పక్కా..

Advertisement

ఈ ఏసీలో వాడిన 9.8cc కంప్రెసర్ వల్ల కూలింగ్ చాలా వేగంగా అందుతుంది. కేవలం చల్లదనం మాత్రమే కాదు.. చలికాలంలో గదిని వెచ్చగా ఉంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొందరికి ఏసీ గాలి నేరుగా ఒంటిపై పడితే ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ ఏసీ ద్వారా వచ్చే గాలి నేరుగా తగలకుండా గది అంతా సమానంగా వ్యాపించేలా దీని ఫ్యాన్ సిస్టమ్‌ను సెట్ చేసింది. దీనివల్ల నిద్రలో ఎలాంటి అసౌకర్యం ఉండదు.

క్లీనింగ్ సమస్య ఉండదు..

ఏసీ అనగానే మనకు గుర్తొచ్చే పెద్ద సమస్య దాని క్లీనింగ్. అయితే ఈ ఏసీలో సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ ఉంది. దీంతో ఇండోర్, అవుట్ డోర్ యూనిట్లు వాటంతట అవే లోపల పేరుకుపోయిన దుమ్మును, బ్యాక్టీరియాను క్లీన్ చేసుకుంటాయి. దీనివల్ల మనకు ఎప్పుడూ స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఒకవేళ ఏసీ సర్వీసింగ్ చేయాల్సిన టైమ్ వచ్చినా.. లేదంటే ఎక్కడైనా దుమ్ము అడ్డుపడినా వెంటనే మన ఫోన్‌కి మెసేజ్ వచ్చేస్తుంది.

Advertisement

Also Read: వామ్మో.. ఫొటో చూపించి ఫోన్లను అన్‌లాక్ చేయొచ్చా? ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో భారీ భద్రతా లోపం!

అన్నీ స్మార్ట్ ఫీచర్లే..

షావోమీ అంటేనే స్మార్ట్ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్ కదా. ఈ ఏసీ కూడా షావోమీ హైపర్ ఓఎస్ కనెక్ట్, మిజియా యాప్‌తో పనిచేస్తుంది. తద్వారా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే ముందే ఫోన్ ద్వారా ఏసీ ఆన్ చేసుకోవచ్చు. ఇక రాత్రిపూట చాలా నిశ్శబ్దంగా పనిచేయడం దీని మరో ప్లస్ పాయింట్. ఇది కేవలం 18 డెసిబుల్స్ సౌండ్‌తో నడుస్తుంది కాబట్టి.. ఎలాంటి శబ్దం రాదన్నమాట.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..

ఏసీ ఇండోర్ యూనిట్ చాలా తేలికగా.. చూడముచ్చటగా ఉంటుంది. షావోమీ కేవలం ఏసీ మాత్రమే కాకుండా, ఈ మధ్యనే జుట్టు ఫాల్ అవ్వకుండా ఉండే స్మార్ట్ హెయిర్ డ్రయర్, టైటానియం థర్మోస్ కప్ వంటి మరికొన్ని వెరైటీ గ్యాడ్జెట్స్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సౌకర్యాలు కావాలనుకునే వారికి షావోమీ తెచ్చిన ఈ కొత్త ఏసీ నిజంగా ఒక సూపర్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: సెల్ఫీ ప్రియులకు పండగే.. 50MP ఫ్రంట్ కెమెరాతో Motorola Edge 70 Pro లాంచ్ కన్ఫర్మ్!

Related News

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Big Stories

Advertisement
×