E-Paper
Advertisement

చక్కెర డబ్బాలో చీమలతో విసిగిపోయారా? ఈ మ్యాజిక్ టిప్స్ పాటిస్తే నిమిషాల్లో అంతా క్లీన్

చక్కెర డబ్బాలో చీమలతో విసిగిపోయారా? ఈ మ్యాజిక్ టిప్స్ పాటిస్తే నిమిషాల్లో అంతా క్లీన్
Advertisement

చక్కెర (పంచదార) డబ్బాలో చీమలు రావడం ప్రతి ఇంట్లో చాలా సాధారణమైన సమస్య. తీయని వాసన చీమలను త్వరగా ఆకర్షిస్తుంది. వేసవి, వర్షాకాలంలో శుభ్రమైన వంటింట్లో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. చీమలు ఉండడం చూసి చాలా మంది ఆ చక్కెరను పారవేస్తారు, లేదా ఎండలో చక్కెరను ఆరబెట్టేవారు. అయినా ఈ సమస్యకు సరైన పరిష్కారం కాదు. ఇంట్లోనే ఉన్న సామగ్రితో సులభంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

చీమలు చక్కెర డబ్బాలోకి ఎందుకు వస్తాయి?

చీమలు ఎప్పుడూ తీపి వస్తువులను వెతుకుతాయి. చక్కెర వాటికి ఇష్టమైన ఆహారం. డబ్బా ఉండే ప్రదేశంలో బయట కొద్దిగా చక్కెర పడితే చాలు చీమలు త్వరగా వస్తాయి. చక్కెర ఎక్కడుందో ఒక చీమ కనుగొన్నాక ఇతర చీమలు కూడా ఆ వాసన వెంబడి వస్తాయి. డబ్బా మూత సరిగా లేకపోతే సమస్య ఇంకా ఎక్కువవుతుంది.

లవంగాలతో చీమలను తరిమేయండి

Advertisement

లవంగాల ఘాటు వాసనను చీమలు ఇష్టపడవు. డబ్బాలో 5-6 లవంగాలు వేసి కొంతసేపు మూత తెరిచి ఉంచండి. చీమలు నెమ్మదిగా వెళ్లిపోతాయి. శాశ్వతంగా కొన్ని లవంగాలు డబ్బాలో ఉంచితే చీమలు మళ్లీ రావు. ఇది చాలా సులభమైన పద్ధతి. పైగా ఎటువంటి రసాయనాలు కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క వాసన కూడా చీమలను దూరంగా ఉంచుతుంది. డబ్బాలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేయండి. లేదా డబ్బా చుట్టూ దాల్చిన పొడి చల్లండి. చీమలు ఆ ప్రాంతాన్ని దాటవు.

కరివేపాకు చీమలను అడ్డుకుంటుంది

Advertisement

కరివేపాకు వాసన చీమలకు నచ్చదు. డబ్బాలో 1-2 కరివేపాకులు వేయండి. కొన్ని రోజులకొకసారి మార్చండి. ఇది చాలా సురక్షితమైన చౌక అయిన ఆప్షన్.

వెనిగర్ స్ప్రే ఉపయోగించండి

వెనిగర్ చీమల వాసన మార్గాలను నాశనం చేస్తుంది. నీళ్లు, వెనిగర్ సమానంగా కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి చీమలు వచ్చే చోటు పిచికారీ చేయండి. రోజూ చేస్తే మంచి ఫలితం వస్తుంది.

నిమ్మకాయ తొక్కలు కూడా సహాయపడతాయి

నిమ్మకాయ తొక్కలలోని యాసిడ్స్ ఉంటాయి. ఈ ఆమ్ల వాసన చీమలను దూరం చేస్తుంది. డబ్బా మూత చుట్టూ నిమ్మ తొక్క రుద్దండి లేదా దగ్గర ఉంచండి. ఇలా చేయడం వల్ల కిచెన్ ఫ్రెష్‌గా ఉంటుంది.

Also Read: ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా గుండెపోటు ఎందుకు వస్తోంది? డాక్టర్లు చెబుతున్న కారణాలు ఇవే

డబ్బాల మూత గట్టిగా టైట్‌గా బిగించండి

ఎప్పుడూ ఎయిర్‌టైట్ డబ్బాల్లో చక్కెర ఉంచండి. డబ్బా బయట భాగంలో కూడా శుభ్రం చేయండి. చక్కెర గింజలు బయట పడకుండా చూడండి.

చీమలు వచ్చే మార్గాలను మూసివేయండి

గోడ పగుళ్లు, కిటికీలు, షెల్ఫ్, సింక్ మూలల్లో చీమలు వచ్చే మార్గాలను సరిగ్గా మూసివేయండి.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×