E-Paper
Advertisement

ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా గుండెపోటు ఎందుకు వస్తోంది? డాక్టర్లు చెబుతున్న కారణాలు ఇవే

ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా గుండెపోటు ఎందుకు వస్తోంది? డాక్టర్లు చెబుతున్న కారణాలు ఇవే
Advertisement

చాలా మంది గుండెపోటు అనేది అనారోగ్యంగా ఉన్నవారికి లేదా వయసు మళ్లినవారికి మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఫిట్‌గా ఉన్న వ్యక్తులకు, యువకులలో కూడా చాలా మందికి గుండె పోటు లాంటి సమస్యలు వస్తున్నాయి. జిమ్ వెళ్లే వారు, ఉద్యోగులు హఠాత్తుగా కుప్పకూలడం సాధారణమవుతోంది. ఈ ఆందోళనకరమైన విషయం భారతదేశంలో గుండె వ్యాధి నిపుణులను ఆలోచింపజేస్తోంది. ఫార్టిస్ ఎక్స్‌కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చైర్మెన్ డాక్టర్ ఆశోక్ సేఠ్ ఈ సమస్యల గురించి వివరించారు.

శరీరం ఫిట్‌గా ఉన్నా గుండె ఆరోగ్యంగా ఉండదు

శరీరం సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నా.. అదే శరీరంలో గుండె పూర్తి ఆరోగ్యంగా ఉందని అర్థం కాదు. అనేక మంది బయటికి ఆరోగ్యంగా కనిపించినా లోపల వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సాధారణ రక్త పరీక్షలు కూడా శరరీంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అంత సులభంగా బయటపడవు. కొలెస్ట్రాల్, షుగర్ సాధారణంగా ఉన్నా రక్తంనాళాల్లో నష్టం జరుగుతూనే ఉంటుంది.

రక్త నాళాలను వాపు నెమ్మదిగా దెబ్బతీస్తుంది

Advertisement

డాక్టర్ అశోక్ సేఠ్ ప్రకారం.. శరీరంలో తెలియని వాపు (సైలెంట్ ఇన్‌ఫ్లమేషన్) రక్త నాళాలను సంవత్సరాల పాటు దెబ్బతీస్తుంది. ఇది గుండెకు రక్తం సరఫరా అడ్డుకుంటుంది. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ ఈ వాపును పెంచి గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

ఒత్తిడి గుండెకు పెద్ద ముప్పు

ఈ రోజుల్లో బిజీ జీవితం వల్ల ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఎక్కువ పని గంటలు, నిద్ర లోపం, కెఫీన్ ఆధారపడటం వల్ల స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి రక్తపోటు పెంచి గుండె పనితీరును దెబ్బతీస్తాయి. డాక్టర్లు ఇప్పుడు ఒత్తిడిని హఠాత్తు గుండెపోటుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

తక్కువ నిద్ర గుండె ఆరోగ్యానికి ప్రమాదం

Advertisement

మంచి నిద్ర గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్ర లోపం వల్ల వాపు, రక్తపోటు పెరుగుతాయి. చాలా యువకులు రోజుకు 4-5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రివేళ పనిచేయడం, విశ్రాంతి లేకుండా అనియమిత షెడ్యూల్ గుండెను బలహీనం చేస్తాయి.

ఫిట్‌గా కనిపించే వ్యక్తులకు హార్ట్ ఎటాక్

జన్యుపరమైన కారణాలు ఫిట్‌గా కనిపించే వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో మీ తల్లిదండ్రులు, లేదా వారి తల్లిదండ్రులకు గుండె సమస్యల చరిత్ర ఉంటే పిల్లలకు కూడా జన్యుపరంగా ఆ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరు వారసత్వంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉంటాయి. అందువల్ల కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే వారు కూడా రెగ్యులర్‌గా గుండె పరీక్షలు చేయించుకోవాలి.

అతిగా వ్యాయామం కూడా హానికరం

సరైన విధంగా, శరీరానికి తగినట్లుగా వ్యాయామం చేయడం మంచిది. కానీ అతిగా చేస్తే ప్రమాదం. స్టెరాయిడ్స్, అనియంత్రిత సప్లిమెంట్స్ తీసుకుంటే హఠాత్తుగా గుండె సమస్యలకు దారితీస్తాయి.

సిగరెట్, మద్యం యువత గుండెలను దెబ్బతీస్తాయి

వ్యాయామం చేసినా ధూమపానం, మద్యం సేవించడం గుండెను బలహీనం చేస్తుంది. ఈ అలవాట్లు ధమనులను దెబ్బతీస్తాయి.

అందరూ నిర్లక్ష్యం చేసే సంకేతాలు

నొప్పి లేకుండా గుండెపోటు రాదు. ఛాతీ బిగుసుకుపోవడం, భుజం, చేయి, దవడ నొప్పి, ఎక్కువగా చెమట పట్టడం, కళ్లు తిరగడం, మూర్ఛ, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

Also Read: రోజంతా ఫ్రెష్‌గా, ఒత్తిడికి దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఈ పనులు చేస్తే సరి

గుండెను రక్షించుకోవడానికి సులభ మార్గాలు.

రోజూ వాకింగ్, యోగా, మెడిటేషన్, మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, ధూమపానం, మద్యం తాగడం మానేయాలి. రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా సమస్య త్వరగానే గుర్తించి సమయానికి చికిత్స తీసుకోవచ్చు.

గుండెపోటు ఇప్పుడు వృద్ధులు, అనారోగ్యులకు మాత్రమే కాదు.. ఫిట్ గా కనిపించే యువకులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఒత్తిడి, జన్యువులు, నిద్రలోపం, తప్పుడు అలవాట్లు నుంచి జాగ్రత్తగా ఉండి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Related News

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

Big Stories

Advertisement
×