E-Paper
Advertisement

హత్య చూసిన తర్వాత ఊపిరి బిగబట్టే ఉత్కంఠ… ఊహించని మలుపులతో వణుకు పుట్టిస్తున్న మూవీ

హత్య చూసిన తర్వాత ఊపిరి బిగబట్టే ఉత్కంఠ… ఊహించని మలుపులతో వణుకు పుట్టిస్తున్న మూవీ
Advertisement

Horror Thriller movie on OTT : థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే మాజానే వీరు. కొన్ని సినిమాలైతే ఒక్కో క్షణం నరాలు తెంపేసినట్లు ఉంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పడు చెప్పుకోబోతున్నాం. ఓటీటీలో ఇది ఒక రక్తపాతంతో కూడిన కరుడుగట్టిన వేటలా సాగుతుంది. లోకల్ గూండాల అడ్డాలో ఇరుక్కుపోయిన నలుగురు అమాయక కుర్రాళ్లు, చావు నోట్లో నుండి ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా. ఇందులో ఫైట్లు సినిమాటిక్ గా కాకుండా, ఒళ్లు గగుర్పొడిచేలా.. పీకలు కోయడం, కుక్కలతో కరిపించడం వంటి సీన్లతో భయం పుట్టించేలా ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే, మనకు కూడా చెమటలు పడుతుంటాయి. దీనికి ఐయండిబిలో ఏడుకు పైగా రేటింగ్ ఉంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

సోల్నియర్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘గ్రీన్ రూమ్’ (Green Room). 2015లో వచ్చిన ఈ సినిమాలో ఆంటోన్ యెల్చిన్, ఇమోజెన్ పూట్స్, పాట్రిక్ స్టెవర్ట్ నటించారు. హాలీవుడ్ దిగ్గజ నటుడు పాట్రిక్ స్టెవర్ట్ ఈ సినిమాలో ఒక క్రూరమైన విలన్ పాత్రలో నటించడం విశేషం. సాధారణంగా ఆయన సానుకూల పాత్రలకు పేరుగాంచారు. కానీ ఇందులో ఒక ప్రమాదకరమైన ముఠా నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను భయపెడుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు ఆయన ఎంతలా ప్రభావితమయ్యారంటే, భయంతో వెంటనే తన ఇంటి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసుకున్నారట. అలాగే ప్రధాన పాత్ర పోషించిన ఆంటోన్ యెల్చిన్ మరణానికి ముందు నటించిన అత్యుత్తమ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిపోయింది. సినిమా అంతా దాదాపు ఒకే భవనంలో జరిగినా, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ వల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా నిరంతరం ఉత్కంఠను కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో ఒక చిన్న మ్యూజిక్ బ్యాండ్ టీమ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఒక మారుమూల ప్రాంతంలోని క్లబ్‌లో ప్రోగ్రాం ఇవ్వడానికి ఒప్పుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళాక, ఆ క్లబ్ నడిపేది ప్రమాదకరమైన ఒక ముఠా అని వారికి అర్థమవుతుంది. ప్రదర్శన ముగిసిన తర్వాత, అనుకోకుండా ఆ క్లబ్‌లోని ఒక గదిలో జరిగిన హత్యను వీళ్ళు చూసేస్తారు. ఆ సాక్ష్యాన్ని బయటపడనీయకూడదని క్లబ్ యజమాని పథకం వేస్తాడు. బ్యాండ్ సభ్యులందరినీ గ్రీన్ రూమ్‌లో బంధించి, వారిని అంతం చేయడానికి తన మనుషులను పురమాయిస్తాడు.

బయట ఆయుధాలతో ఉన్న ముఠా సభ్యులు, లోపల ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్న నిస్సహాయులైన కళాకారుల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన పోరాటమే ఈ సినిమా. తమ వద్ద ఎటువంటి ఆయుధాలు లేకపోయినా, ప్రాణభయంతో ఆ కుర్రాళ్లు ఎదురుదాడి చేస్తారు. క్లబ్ యజమాని చాలా తెలివిగా వారిని దెబ్బకొట్టాలని చూస్తుంటే, వీళ్ళు తమ తెలివితేటలతో ఎలా తప్పించుకోవాలని ప్రయత్నించారనేది చాలా సీరియస్‌గా సాగుతుంది. ఈ క్రమంలో జరిగే సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి.

Advertisement

Read Also : 11 సీజన్లతో దుమ్ములేపిన జాంబి సిరీస్… ఐయండిబిలో 8.1రేటింగ్… ప్రతి మలుపులోనూ ఉత్కంఠ

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×