వేసవి కాలంలో వేడి వాతావారణం కారణంగా పాలు చాలా త్వరగా విరిగిపోతాయి. ఎండలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. చాలా మంది ప్రతి రోజూ పాలు విరిగిపోయి, చెడిపోయినట్లు చూసి విసుక్కుంటారు. కానీ ఇంట్లోనే ఉన్న చిన్న చిన్న చిట్కాలతో పాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు.
వేడి వాతావరణం బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్లు, చక్కెరలు బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయి. ఉష్ణోగ్రత పెరగడం వల్ల పాలలో యాసిడిటీ పెరిగి విరిగిపోతాయి. ఫ్రిజ్‌లో సరిగా ఉంచకపోవడం కూడా సమస్యను పెంచుతుంది.
పాలు విరిగిపోతకుండా ఉండాలంటే మరగబెట్టేటప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేయండి. ఇది పాల యొక్క pH స్థాయిని సమతుల్యం చేసి, అందులో ఆమ్లత్వం పెరగకుండా చూస్తుంది. ఎక్కువ వేయకూడదు, రుచి మారిపోతుంది.
బయట నుంచి పాలు తెచ్చిన వెంటనే మరగబెట్టాలి. పచ్చి పాలు వేసవిలో చాలా త్వరగా చెడిపోతాయి. వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోయి పాలు సురక్షితంగా ఉంటాయి.
వేడి పాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఫ్రిజ్ ఉష్ణోగ్రత పెరిగి ఇతర ఆహారాలు కూడా చెడిపోవచ్చు. ముందు పాలు చల్లార్చి, తర్వాత ఫ్రిజ్‌లో ఉంచండి.
మురికి పాత్రలు, స్పూన్లు పాలలో బ్యాక్టీరియాను పెంచుతాయి. పాలు మరగబెట్టడానికి, నిల్వ చేయడానికి ఎప్పుడూ శుభ్రమైన, పొడిగా ఉండే పాత్రలు వాడండి.
పాలు అడుగున అంటుకోకుండా, కాలకుండా ఉండాలంటే ముందు పాత్రలో చిన్నగా నీళ్లు పోసి, తర్వాత పాలు పోయాలి. ఇది పాలు కాలిపోకుండా చూస్తుంది.
పాలను ఫ్రిజ్ డోర్‌లో కాకుండా, మధ్య లేదా కింది షెల్ఫ్‌లో ఉంచండి. గట్టిగా మూత పెట్టి ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
పాల ప్యాకెట్లను ఎండలో లేదా వేడి ప్రాంతంలో ఉంచకండి. నమ్మకమైన దుకాణం నుంచి మాత్రమే పాలు కొనండి.
అవసరమైనంత మాత్రమే పాలు వేడి చేయండి. తరచూ వేడి చేయడం వల్ల పాల నాణ్యత తగ్గుతుంది.
Also Read: నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలే కారణం
కొద్దిగా విరిగిపోయిన పాలతో పనీర్, రసగుల్లా లాంటి వంటలు చేసుకోవచ్చు. దుర్వాసన వచ్చే పాలను మాత్రం పారవేయండి.
వేసవిలో పాలు త్వరగా చెడిపోకుండా ఉంచాలంటే బేకింగ్ సోడా, త్వరగా మరగబెట్టడం, శుభ్రమైన పాత్రలు, సరైన ఫ్రిజ్ నిల్వ వంటి చిన్న చిట్కాలు పాటించండి. ఇలా చేస్తే పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.