E-Paper
Advertisement

దేశంలోనే బెస్ట్ పవర్ సేవింగ్ ఏసీలు.. ఇక రూ.500 లోపే కరెంటు బిల్లు.. వర్త్ వర్మా వర్త్!

దేశంలోనే బెస్ట్ పవర్ సేవింగ్ ఏసీలు.. ఇక రూ.500 లోపే కరెంటు బిల్లు.. వర్త్ వర్మా వర్త్!
Advertisement

Energy Saving ACs 2026: వేసవి వచ్చిందంటే చాలు.. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకూ ప్రతీ ఒక్కరి దృష్టి ఏసీల వైపు మళ్లుతుంది. అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి ఏసీ కొనడం ఒక ఎత్తు అయితే.. ప్రతీ నెలా వచ్చే కరెంటు బిల్లును తట్టుకోవడం మరో ఎత్తు. అందుకే చాలా మంది విద్యుత్ ను పొదుపుగా వాడే ఏసీల కోసం అన్వేషిస్తుంటారు. ‘స్మార్ట్ అండ్ ఎనర్జీ సేవింగ్’ ఏసీల కోసం వెతుకుతుంటారు. ఈ వేసవిలో మీ జేబుకు చిల్లు పడకుండా.. మెరుగైన కూలింగ్ అందించే 5 అత్యుత్తమ 5 స్టార్ స్మార్ట్ ఏసీలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేసి.. మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోండి.

LG 1.5 Ton 5 Star AI Dual Inverter

దేశంలో అత్యధిక మంది విశ్వసించే బ్రాండ్లలో ఎల్ జీ ఒకటి. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఈ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ.. గదిలోని మనుషుల సంఖ్యను బట్టి కూలింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనిలోని ‘6-ఇన్-1’ కూలింగ్ మోడ్ ద్వారా మనం కరెంటు వినియోగాన్ని 40% వరకు తగ్గించుకోవచ్చు. ‘ThinQ’ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మీ ఫోన్‌తో ఏసీని ఆపరేట్ చేయవచ్చు.

Panasonic 1.5 Ton 5 Star Wi-Fi

Advertisement

టెక్నాలజీ పరంగా పానాసోనిక్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ ఏసీ బయటి ఉష్ణోగ్రతను బట్టి ఆటోమేటిక్‌గా మోడ్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అలెక్సా (Alexa), గూగుల్ అసిస్టెంట్‌ వంటి వాయిస్ కంట్రోల్ యాప్స్ తో ఈ ఏసీని కంట్రోల్ చేయవచ్చు. రాత్రిపూట నిద్రకు భంగం కలుగకుండా కూలింగ్ ను దానంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది.

Daikin 1.5 Ton 5 Star Inverter

ఏసీల విభాగంలో డైకిన్ కంపెనీకి మంచి గుడ్ విల్ ఉంది. ఈ ఏసీని ‘డ్యూ పాయింట్ సెన్సార్’ టెక్నాలజీతో డైకిన్ తీసుకొచ్చింది. ఇది గదిలో తేమను (Humidity) తగ్గించి ఆహ్లాదకరమైన గాలిని ఇస్తుంది. ఇందులో ఉండే ‘ఎకో మోడ్’ విద్యుత్ ఆదా చేయడంలో దిట్ట అని కంపెనీ వర్గాలు తెలిపాయి. స్టెబిలైజర్ అవసరం లేకుండానే వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఇది తట్టుకుంటుందని పేర్కొన్నాయి.

Samsung 1.5 Ton 5 Star WindFree

Advertisement

శాంసంగ్ ఈ ఏసీని అధునాతన కూలింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చింది. ఏసీ గాలి నేరుగా ఒంటికి తగిలితే జలుబు చేస్తుందని భయపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులోని 23,000 మైక్రో హోల్స్ ద్వారా గాలి నేరుగా శరీరానికి తగలకుండా గది అంతా సమానంగా వ్యాపిస్తుంది. ‘SmartThings’ యాప్ ద్వారా మీ ఏసీ ఎంత కరెంటు వాడుతుందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసుబాటును సైతం కంపెనీ కల్పించింది.

Also Read: Wearable AC: సోనీ సంచలనం.. షర్ట్ లోపలే ఏసీ.. ఇక ఎండ ఎంత ఉన్నా డోంట్ కేర్!

Blue Star 1.5 Ton 5 Star Inverter

దేశ వాతావరణ పరిస్థితులను అనగుణంగా ఏసీలను తయారు చేయడంలో బ్లూ స్టార్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బ్లూస్టార్ తీసుకొచ్చిన ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీ.. 52 డిగ్రీల ఎండలో కూడా గదిని వేగంగా చల్లబరుస్తుంది. దీనికి వై-ఫై సదుపాయంతో పాటు వాయిస్ కమాండ్స్‌ సపోర్ట్ ను కూడా అందించారు.

Also Read: Air Conditioner: నీటి తుంపర్ల చిట్కా.. సగానికే పవర్ బిల్లు.. ఏసీ యూజర్లకు పండుగే!

Related News

Free AC Scheme 2026: ప్రభుత్వం గుడ్ న్యూస్.. తీవ్రమైన ఎండల దృష్ట్యా.. ఉచితంగా ఏసీల పంపిణీ!

OTT సబ్‌స్క్రిప్షన్లు, అన్ లిమిటెడ్ డేటా.. రూ.వెయ్యి బడ్జెట్‌లో టాప్ ప్లాన్‌లు!

Wearable AC: సోనీ సంచలనం.. షర్ట్ లోపలే ఏసీ.. ఇక ఎండ ఎంత ఉన్నా డోంట్ కేర్!

Wi-Fi AC ఏసీ అంటే లగ్జరీ కాదు.. టైం, కరెంట్ బిల్లును సేవ్ చేసే స్మార్ట్ టెక్నాలజీ!

రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు పెరగకూడదా? రిమోట్‌లో ఈ ‘సీక్రెట్’ బటన్ నొక్కండి చాలు !

షాకింగ్ అప్డేట్.. వాట్సప్‌లో ఇక పెయిడ్ సర్వీస్, ఆ 6 ఫీచర్లు వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే!

సమ్మర్‌లో ఏసీ వాడుతున్నారా ? ఇవి తెలుసుకోకపోతే ప్రమాదమే..

Big Stories

Advertisement
×