E-Paper
Advertisement

పిల్లలకు 18 ఏళ్ల వయసు నిండేలోపు ఈ పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. లేకుంటే జీవితాంతం కష్టాలే

పిల్లలకు 18 ఏళ్ల వయసు నిండేలోపు ఈ పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. లేకుంటే జీవితాంతం కష్టాలే
Advertisement

అపర మేధావి, ఆర్థిక తత్వవేత్త అయిన చాణక్యుడు జీవితానికి ఉపయోగపడే ఎన్నో విలువైన బోధనలు చేశాడు. ఆయన చెప్పిన అనేక విషయాలు తరతరాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. మంచి అలవాట్లు చిన్నప్పుడే నేర్చుకుంటే పిల్లల భవిష్యత్తు మరింత బలంగా మారుతుంది. తల్లిదండ్రులే ఈ విలువలను పిల్లల్లో పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

బద్ధకం విజయానికి పెద్ద అడ్డంకి

చాణక్యుడు రాసిన చాణక్య నీతి ప్రకారం బద్ధకం మనిషి ఎదుగుదలను అడ్డుకుంటుంది. కష్టపడి పనిచేసే అలవాటు ఉంటే జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయి. పిల్లలకు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేసే అలవాటు నేర్పాలి. చిన్న చిన్న బాధ్యతలు వారికి క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. కష్టం విలువ తెలిసిన పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులవుతారు. మంచి ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్రమశిక్షణతో పాటు పొదుపు కూడా అవసరం

Advertisement

చాణక్యుడు క్రమశిక్షణను గొప్ప బలంగా భావించాడు. అలాగే డబ్బు విలువను చిన్నప్పుడే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించాడు. అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపు చేయడం ఎంత ముఖ్యమో నేర్పాలి. కనిపించిన ప్రతిదీ వెంటనే కొనడం కాకుండా అవసరాన్ని గుర్తించడం అలవాటు కావాలి. ఈ చిన్న ఆర్థిక అలవాట్లు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి.

చెడు స్నేహాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి

మన చుట్టూ ఉండే వ్యక్తులు మన ఆలోచనలపై ప్రభావం చూపుతారని చాణక్యుడు చెప్పాడు. చెడు స్నేహాల వల్ల పిల్లలు తప్పుడుదారిలో వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో వారికి వివరించాలి. మంచి వాతావరణం పిల్లల్లో మంచి విలువలను పెంచి సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.

జ్ఞానం జీవితంలో గొప్ప సంపద

Advertisement

చాణక్యుడి దృష్టిలో జ్ఞానం అత్యంత విలువైన ఆస్తి. చదువు పాఠశాలతోనే ముగియదని పిల్లలకు తెలియజేయాలి. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. నిరంతర అభ్యాసం ఆత్మవిశ్వాసాన్ని పెంచి అవకాశాలను విస్తరిస్తుంది.

Also Read: పెళ్లిళ్లు, పార్టీల్లో అందరి చూపు మీపైనే.. ఫంక్షన్స్‌లో మీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ఫ్యాషన్ టిప్స్

సమయం ఎంత విలువైనదో నేర్పాలి

చాణక్యుడు సమయాన్ని అమూల్యమైన సంపదగా భావించాడు. సమయాన్ని వృథా చేస్తే తర్వాత పశ్చాత్తాపం తప్పదని ఆయన సూచించాడు. పిల్లలకు సమయపాలన అలవాటు చేయాలి. రోజువారీ పనులను ముందుగానే ప్రణాళికతో చేసుకునే అలవాటు పెంచాలి. సమయాన్ని గౌరవించే వారు జీవితంలో అన్ని చోట్ల గౌరవించబడతారు. దీని వల్ల వారికి మంచి అవకాశాలతో పాటు విజయం కూడా సాధిస్తారు.

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, పొదుపు, మంచి స్నేహాలు, జ్ఞానం, సమయపాలన వంటి విలువలను చిన్నప్పుడే నేర్పితే వారు బాధ్యతగల యువతగా ఎదిగే అవకాశం పెరుగుతుంది. ఈ అలవాట్లు జీవితాంతం వారికి బలమైన పునాది అవుతాయి.

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×