E-Paper
Advertisement

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? దీనికి కారణాలు ఇవే

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? దీనికి కారణాలు ఇవే
Advertisement

చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నవారికే కాదు, ఉద్యోగం చేసే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. కొంతమంది పని చేయాలనే ఆసక్తి కోల్పోయి కాసేపు పడుకోవాలని అనుకుంటారు. చాలామంది ఇదంతా బద్ధకం అని అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలో అది నిజం కాదు. మనం తినే ఆహారం, దాని పరిమాణం, జీర్ణక్రియ కూడా దీనికి కారణం కావచ్చు.

ఎక్కువగా తినడం వల్ల అలసట రావచ్చు

మధ్యాహ్నం భోజన సమయంలో చాలామంది అవసరానికి మించి తింటారు. ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం అదనపు శక్తిని వినియోగిస్తుంది. దీంతో శరీరంలోని శక్తి.. జీర్ణక్రియపై ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. ఫలితంగా అలసట, నిద్రమత్తు అనిపించే అవకాశం ఉంటుంది. తరచుగా ఎక్కువగా తినే అలవాటు ఈ సమస్యను మరింత పెంచుతుంది.

తీపి పదార్థాలు కూడా కారణం కావచ్చు

Advertisement

భోజనం తర్వాత చాలామంది టీ, బిస్కెట్లు, కేకులు లేదా స్వీట్లు తినడం ఇష్టపడతారు. అలాగే మైదాతో చేసిన ఆహారాలను కూడా తీసుకుంటారు. ఇలాంటి ఆహారాలు రక్తంలో షుగర్ లెవెల్స్‌ని ఒక్కసారిగా పెంచుతాయి. మొదట కొంత ఉత్సాహంగా అనిపించినా, తిన్న కాసేపు తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు. దీంతో అలసట, బలహీనత, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

జీర్ణక్రియ సరిగా లేకపోయినా నిద్ర రావచ్చు

కొంతమందికి భోజనం తర్వాత కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం లేదా గ్యాస్ సమస్యలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ బలహీనంగా ఉన్నట్లు సంకేతాలు కావచ్చు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. దీనివల్ల శక్తి తగ్గి నిద్రమత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తరచుగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.

రోజంతా చురుకుగా ఉండాలంటే ఏమి చేయాలి?

Advertisement

ప్రతిసారి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. పప్పులు, గుడ్లు, పెరుగు, శనగలు, పనీర్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇవి శక్తిని నిలకడగా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read: ఆఫీసులో కూర్చొని గంటల తరబడి పనిచేస్తన్నారా? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఒకేసారి ఎక్కువగా తినకూడదు

భోజన పరిమాణాన్ని నియంత్రించండి. కడుపు పూర్తిగా నిండే వరకు తినకుండా కొద్దిగా తగ్గించడం మంచిది.

భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి

అయితు నుంచి పది నిమిషాలు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో చురుకుదనం పెరగడానికి ఉపయోగపడుతుంది.

తగినంత నీరు తాగండి

శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు కూడా అలసట వస్తుంది. రోజంతా సరిపడా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతిరోజూ నిద్ర వస్తుంటే దాన్ని తేలికగా తీసుకోవద్దు. ఎక్కువగా తినడం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం లేదా జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. సమస్య కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×