E-Paper
Advertisement

Slow Aging: ఎక్కువ భాషలు మాట్లాడితే, ఎక్కువ కాలం జీవిస్తారా? ఈ స్టడీ భలే విచిత్రంగా ఉందే!

Slow Aging: ఎక్కువ భాషలు మాట్లాడితే, ఎక్కువ కాలం జీవిస్తారా? ఈ స్టడీ భలే విచిత్రంగా ఉందే!
Advertisement

కాలుష్యం లేని ప్రదేశంలో జీవించడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చాలా మంది చెప్తుంటారు. కానీ, తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు పరిశోధకులు. సుమారు 86 వేల మంది  మీద జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎక్కువ భాషలు మాట్లాడే వారు.. ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. అదెలాగంటే..

యూరోపియన్ పరిశోధకులు అధ్యయనం

తాజాగా యూరోపియన్ పరిశోధకులు ‘Biobehavioral Age Gaps’ అనే విషయంపై అధ్యయనం జరిపారు. ఇందులో  ఒకే భాష మాట్లాడే వారితో పోలిస్తే.. ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించారు. ఒక వ్యక్తి ఎక్కువ భాషలు మాట్లాడితే.. వృద్ధాప్యానికి ఎక్కువ దూరంగా ఉంటున్నట్లు తేల్చారు. భాష అనేది అభ్యాసం, సాంస్కృతికంగా మనిషిని సుసంపన్నం చేయడమే కాకుండా.. జీవితాంతం మెదడు ఆరోగ్యం, వృద్ధాప్యం దూరంగా ఉంటున్నట్లు పరిశోధన ఫలితాలు తెలిపాయి. 27 యూరోపియన్ దేశాలలో 86,149 మందిపై ఈ అధ్యయనం కొనసాగింది.  బహుభాషా నిపుణులలో వృద్ధాప్య అవకాశం 2.17 రెట్లు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. భాషలు పెరుగుతున్న కొద్దీ వయస్సు సంబంధిత క్షీణతకు తగ్గి, ఎక్కువ రక్షణ కలుగుతుందని తేల్చారు.

ఒక్కో భాష ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుందా?

Advertisement

ఎక్కువ భాషలు మాట్లాడ్డం వల్ల సాంస్కృతిక, సామాజిక విలువలు పెరగడంతో పాటు మెదడు, శరీర ఆరోగ్యం పెరుగుతున్నట్లు గుర్తించారు. వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తున్నట్లు తేల్చారు. ట్రినిటీ కాలేజ్ డబ్లిన్‌లోని డాక్టర్ అగస్టిన్ ఇబానెజ్, అతడి సహ బృందం అయిన లూసియా అమోరుసో, బ్రెయిన్‌ లాట్, హెర్నాన్ హెర్నాండెజ్, బ్రెయిన్‌ లాట్ నేతృత్వంలోని అంతర్జాతీయ అధ్యయనం.. ఎక్కువ  భాషలు మాట్లాడటం అనేది వృద్ధాప్య జీవ ప్రక్రియలను నెమ్మదిగా మార్చుతున్నట్లు గుర్తించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన కథనం నేచర్ ఏజింగ్‌  జర్నల్ లో ప్రచురించబడింది.

86 వేల మందిపై అధ్యయనం

యూరప్ అంతటా 86,149 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారి డేటా ఆధారంగా బహుభాషా వ్యక్తులు, ఒకే  భాష మాట్లాడే వారితో పోలిస్తే నెమ్మదిగా బయోబిహేవియరల్ వృద్ధాప్యాన్ని పొందుతున్నట్లు గుర్తించారు. వినూత్న బయోబిహేవియరల్ ఏజింగ్ క్లాక్ ఫ్రేమ్‌ వర్క్‌ ను ఉపయోగించి, పరిశోధకులు బయోబిహేవియరల్ ఏజ్ గ్యాప్‌లను   లెక్కించారు. ఈ శాంపిల్స్ శారీరక పరిస్థితులు అయిన రక్తపోటు, మధుమేహం, నిద్ర సమస్యలు..  విద్య, జ్ఞానం, క్రియాత్మక సామర్థ్యం, ​​శారీరక శ్రమ లాంటి లక్షణాల నుంచి  ఒక వ్యక్తి జీవసంబంధమైన వయస్సును అంచనా వేశారు. దీని ఆధారంగా వాస్తవ వయస్సు మధ్య వ్యత్యాసాన్ని లెక్కించారు. సాధారణంగా కనీసం ఒక అదనపు భాష మాట్లాడే వ్యక్తులు వేగవంతమైన వృద్ధాప్యాన్ని అనుభవించే అవకాశం 2.17 రెట్లు తక్కువగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. ఒక భాష మాట్లాడేవారు ముందస్తు వృద్ధాప్యాన్ని పొందుతున్నట్లు తేల్చారు. ఎన్ని ఎక్కువ భాషలు వస్తే అంత ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

Read Also: ఆఫీసులోనే ఆ పనులు కానిచ్చేస్తున్న ఇండియన్స్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్!

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×