E-Paper
Advertisement

Romance in Office: ఆఫీసులోనే ఆ పనులు కానిచ్చేస్తున్న ఇండియన్స్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్!

Romance in Office: ఆఫీసులోనే ఆ పనులు కానిచ్చేస్తున్న ఇండియన్స్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్!
Advertisement

Romance in Office- India Ranks 2nd:

ఆఫీస్ అన్నాక అందరూ కలివిడిగా ఉంటారు. కొంత మంది సరదాగా ఉంటే, కొంత మంది సరసాలు ఆడేవరకు వెళ్తారు. అయితే, ఆఫీస్ లో ఆటగాళ్ల గురించి తాజాగా ఓ ఆసక్తికర అధ్యయనం జరిగింది. ఏ దేశంలో ఎక్కువగా ఆఫీస్ లో రొమాన్స్ చేస్తారు? అనే విషయం మీద అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో భారత్ ఏకంగా రెండో ర్యాంక్ లో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డేటింగ్ ప్లాట్ ఫారమ్ ఆష్లే మాడిసన్ ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ స్టడీ 11 దేశాలలో YouGov సహకారంతో నిర్వహించింది.

అగ్రస్థానంలో నిలిచిన మెక్సికో  

ఆష్లే మాడిసన్ అధ్యయనం ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, UK, USలో జరిగింది. మొత్తం 13,581 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వర్క్ ప్లేసెస్ లో వృత్తిపరమైన హద్దులు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇండియాలో కాస్త కఠినంగానే ఉన్నా, అసాధారణం మాత్రం కాదని అధ్యయనం తెలిపింది. భారత్ లో సాధారణ జనాభాలో 10 మందిలో నలుగురు సహోద్యోగితో డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక మెక్సికో ఆఫీస్ రొమాన్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ఆష్లే మాడిసన్ అధ్యయనం తెలిపింది. 43 శాతం మంది సహోద్యోగులతో ప్రేమలో ఉన్నారని చెప్పగా, 40 శాతం మంది భారతీయులు కూడా అదే చెప్పారు. ఇది US, UK,  కెనడా లాంటి దేశాల కంటే చాలా ఎక్కువ. ఇక్కడ ఈ సంఖ్య 30 శాతంగా ఉంది. ఆసక్తికరంగా, పురుషులు సహోద్యోగితో డేటింగ్ చేసే అవకాశం మహిళల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Advertisement

Read Also:  సింగిల్స్‌ కు వల వేస్తున్న డేటింగ్ యాప్స్.. హైదరాబాదులో ఇవి బాగా ఫేమస్, జర భద్రం గురూ!

మహిళలో పోల్చితే పురుషులే ముందు..

వర్క్ ప్లేస్ లో రొమాన్స్ విషయంలో మహిళలతో పోల్చితే పురుషులే ముందున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  మహిళలు 36 శాతం సహోద్యోగులతో రొమాన్స్ చేస్తున్నట్లు చెప్పగా, పురుషులు 51 శాతంగా ఉండటం విశేషం. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను కలుపుకుని మహిళలు మరింత జాగ్రత్తగా ఉంటున్నట్లు అధ్యయం వెల్లడించింది.  దాదాపు 29 శాతం మంది మహిళలు వృత్తిపరమైన పరిణామాల కారణంగా ఆఫీస్ రిలేషన్ షిప్  కొనసాగించకుండా నిరుత్సాహపడుతున్నారని చెప్పారు.   అయితే, ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల యంగ్ ఎంప్లాయీస్ ఆఫీస్ రొమాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నట్లు తేలింది.  అలాంటి సంబంధాలు తమ కెరీర్‌ ను ఎలా ప్రభావితం చేస్తాయోననే భయంతో ఉన్నట్లు 34 శాతం మంది చెప్పడం విశేషం. ఆసక్తికరంగా, ఈ మార్పు మెట్రో నగరాలకే పరిమితం కాదు.  చిన్న పట్టణాలలో కూడా ఇలాంటి ధోరణులు కనిపిస్తున్నాయి. ఆఫీస్ రొమాన్స్ లో ఇండియాలో కాంచీపురం అగ్రస్థానంలో ఉండటం విశేషం.

Advertisement

Read Also: ఆహా.. ఆ దేశంలో కూడా సోషల్ మీడియా బ్యాన్, మరి ఇండియాలో ఎప్పుడో?

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×