
Raashi Khanna Images(Source: Instagram)
Raashi Khanna Latest Photos: హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుసు కదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.

Raashi Khanna Images(Source: Instagram)
దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఎన్నో ఆశలతో తెలుగు రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మళ్లి నిరాశే ఎదురైంది.

Raashi Khanna Images(Source: Instagram)
చివరిగా నాగ చైతన్య థ్యాంక్యూ, విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కనిపించింది. ఇవి రెండు కూడా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. దీంతో రాశీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

Raashi Khanna Images(Source: Instagram)
దీంతో ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వెబ్ సిరీస్, సినిమాలు చేసింది. కానీ అవి ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేకపోయాయి.

Raashi Khanna Images(Source: Instagram)
అదే సమయంలో లాంగ్ గ్యాప్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ ఆఫర్ అందుకుంది. చాలా రోజుల తర్వాత రాశీ తెలుగులో నటిస్తుండటంతో ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుష్ అయ్యారు.

Raashi Khanna Images(Source: Instagram)
ఇక రాశీ కూడా ఈ చిత్రంతో మంచి హిట్ అందుకుని టాలీవుడ్ కి మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశ పడింది. కానీ, తెలుసు కదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుని యావరేజ్ గా నిలిచింది.

Raashi Khanna Images(Source: Instagram)
ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగులో మరో సినిమాకు సంతకం చేసింది లేదు. సినిమాలు లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

Raashi Khanna Images(Source: Instagram)
తాజాగా ఈ భామ తన ఫోటోలు షేర్ చేసింది. లెహంగాలో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.